Share News

సమీపిస్తున్న గడువు...

ABN , Publish Date - Mar 17 , 2026 | 11:19 PM

జిల్లాలోని క్యాత న్‌పల్లి మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక విషయంలో హై కోర్టు విధించిన గడువు సమీపిస్తోంది. రాష్ట్రంలో వా యిదాపడ్డ క్యాతన్‌పల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్‌ ముని సిపల్‌ ఎన్నికలను మూడు వారాల్లోగా నిర్వహించాలని హై కోర్టు ఈ నెల 6వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది.

సమీపిస్తున్న గడువు...
క్యాతన్‌పల్లి మునిసిపల్‌ కార్యాలయం

-క్యాతన్‌పల్లి మునిసిపల్‌ ఎన్నికలపై ఉత్కంఠ

-హై కోర్టు ఇచ్చిన గడువులో మిగిలింది వారం రోజులే

-ఒకటి రెండు రోజుల్లో డేట్‌ ఫిక్స్‌ చేయనున్న ఈసీ

-చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎంపికలో సీపీఐ మద్దతే కీలకం

మంచిర్యాల, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని క్యాత న్‌పల్లి మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక విషయంలో హై కోర్టు విధించిన గడువు సమీపిస్తోంది. రాష్ట్రంలో వా యిదాపడ్డ క్యాతన్‌పల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్‌ ముని సిపల్‌ ఎన్నికలను మూడు వారాల్లోగా నిర్వహించాలని హై కోర్టు ఈ నెల 6వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశానుసారం మరో వారం రోజుల్లోగా చైర్మన్‌, వైస్‌ చై ర్మన్‌ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. గత నెల 13న మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడగా, 16వ తేదీన చై ర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. క్యాతన్‌పల్లి మునిసిపాలిటీ పరిధిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణంలో భాగంగా ఎన్నిక నిర్వహించలేని పరిస్థితులు నెలకొనడంతో ఒకరోజు వాయిదా పడింది. మరుసటి రోజు కూడా అవే పరిస్థితులు పునరావృతం కా వడంతో తుది నిర్ణయాన్ని స్థానిక అధికారులు రాష్ట్ర ఎన్ని కల కమిషన్‌ (ఈసీ)కి వదిలిపెట్టారు.

ఘర్షణ వాతావరణలో వాయిదా...

మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు భిన్నంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుర్చీ కోసం పాకులాడటంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మంత్రి గడ్డం వివేకా నంద సొంత నియోజకవర్గం కావడంతో చైర్మన్‌, వైస్‌ చైర్మ న్‌ పదవులను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ము నిసిపాలిటీలో 22 వార్డులు ఉండగా, ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఏడు, బీఆర్‌ఎస్‌, సీపీఐ కూటమికి కలిపి మొత్తం 14 సీట్లు లభించాయి. ఇందులో బీఆర్‌ఎస్‌కు పది సీట్లు రాగా, మిత్ర పక్షమైన సీపీఐకి నాలుగు స్థానాలు దక్కాయి. ఎన్నికల్లో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఎన్నికల్లో బీ ఆర్‌ఎస్‌, సీపీఐ కూటమికే మెజారిటీ సీట్లు రాగా, ఊహిం చని రీతిలో ప్రజలు తీర్పు ఇవ్వడంతో మంత్రి వివేకానంద తాను ప్రాతినిథ్యం వహిస్తున్న క్యాతన్‌పల్లి మునిసిపాలిటీని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలకు వచ్చారు. ఒక దశలో సీపీఐ నాయకులతో మంత్రి అనుచరులు టచ్‌లోకి వెళ్లారు. గమనించిన మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ కాంగ్రెస్‌ ప్రయత్నాలను అడ్డుకు న్నారు. తమ కూటమికి చెందిన 14 మందిని ఖమ్మంలో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించారు. గత నెల 16న ప్ర మాణ స్వీకారం సందర్భంగా బాల్క సుమన్‌ బీఆర్‌ఎస్‌ శ్రే ణులు, కూటమి సభ్యులతో మునిసిపల్‌ కార్యాలయానికి బ యల్దేరగా, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారన్న కారణం తో మార్గమద్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సకా లంలో కూటమి సభ్యులు వేదిక వద్దకు చేరుకోక పోవడం తో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వా యిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరునాడు కాంగ్రెస్‌, బీ ఆర్‌ఎస్‌ నడుమ నెలకొన్న ఉధ్రిక్త వాతావరణం నేపథ్యం లో ఎన్నిక నిర్వహించలేమంటూ అధికారులు చేతులెత్తేశా రు. దీంతో మరోమారు కూడా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా పడింది.

హై కోర్టు ఆదేశాలతో...

కూటమికి చెందిన సభ్యుల సంఖ్య మ్యాజిక్‌ ఫిగర్‌ దా టడంతో న్యాయం కోసం వారంతా హై కోర్టును ఆశ్రయిం చారు. దీంతో మూడు వారాల్లోగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎ న్నిక పూర్తి చేయాలంటూ ఎన్నికల కమిషన్‌ను కోర్టు ఆదే శించింది. హై కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్ణీత గడువులోగా ఈసీ ఎన్నిక నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొంది. కోర్టు విధించిన గడువు సమీపిస్తుండటంతో ఎన్నిక అనివార్యమైం ది. కేవలం వారం రోజుల గడువు ఉండటంతో ఒకటి రెండు రోజుల్లో ఈసీ ఎన్నికల తేదీని ఫిక్స్‌ చేసే అవకాశాలు ఉ న్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మూడు మునిసిపాలిటీల్లో చై ర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించాల్సి ఉండటంతో వేర్వే రుగా తేదీలు ప్రకటిస్తారని సమాచారం.

సీపీఐ మద్దతే కీలకం...

ఎన్నికల్లో సీపీఐకి నాలుగు స్థానాలు దక్కడంతో రెండు పార్టీలకు ప్రస్తుతం వారి మద్దతే తప్పనిసరి అయింది. ప్ర స్తుతం సీపీఐ సభ్యులు బీఆర్‌ఎస్‌తో పొత్తులో ఉన్నందున కాంగ్రెస్‌ నాయకులు సైతం వారి మద్దతు కోసం ప్రయత్ని స్తున్నారు. ఒకవేళ సీపీఐ సభ్యులు కాంగ్రెస్‌కు మద్దతిస్తే ఎక్స్‌ ఆఫీషియో ఓట్లు రెండింటితో కలిపి ఆ పార్టీ మెజారిటీ 14కు చేరుకుంటుంది. మ్యాజిక్‌ ఫిగర్‌ దాటనున్నందున చై ర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు అధికార పార్టీ ఖాతాలోకి వెళ తాయి. అలా కాకుండా సీపీఐ తన స్టాండ్‌ను మార్చుకోక పోతే మునిసిపాలిటీ బీఆర్‌ఎస్‌ వశం కానుంది. ఈ క్రమం లో సీపీఐ సభ్యుల మద్దతే క్యాతన్‌పల్లి మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో కీలకం కానుంది.

Updated Date - Mar 17 , 2026 | 11:19 PM