అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:02 AM
అర్హులైన పాత్రికేయులు అక్రిడిటేషన్ కార్డుల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీ (ఎస్‌ఎంఏసీ) సూచించింది.
అర్హులైన జర్నలిస్టులకు ఎస్‌ఎంఏసీ సూచన
హైదరాబాద్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): అర్హులైన పాత్రికేయులు అక్రిడిటేషన్ కార్డుల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీ (ఎస్‌ఎంఏసీ) సూచించింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కమిటీ సమావేశంలో అర్హులైన వయోధిక పాత్రికేయులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఎస్‌ఎంఏసీ చైర్మన్ శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ, అర్హులైన జర్నలిస్టులు వెంటనే ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత కలిగిన ఏ ఒక్క పాత్రికేయుడు నష్టపోకుండా పారదర్శకంగా కార్డులు జారీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీల (డీఎంఏసీ) తరపున కలెక్టర్లు పంపిన ప్రతిపాదనలను కూడా తదుపరి సమావేశంలో సమీక్షకు తీసుకుంటామని చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో కమిటీ తిరిగి సమావేశమవుతుందని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.