kumaram bheem asifabad- దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలి
ABN , Publish Date - Mar 30 , 2026 | 10:19 PM
ఆయా శాఖల అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు నుంచి వచ్చే దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు.
ఆసిఫాబాద్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఆయా శాఖల అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు నుంచి వచ్చే దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై వచ్చే దరఖాస్తులను క్షత్రే స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని చెప్పారు. పత్రికలలో వచ్చే ప్రతికూల వార్లపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అర్జీలను స్వీకరించారు. తిర్యాణి మండలం ఎదులపాడ్ గ్రామ సర్పంచ్ పార్వతి తమ గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న అరటిపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ భవనం నిర్మాణం చేపట్టాలని దరఖాస్తు చేసుకోకున్నారు. ఆసిఫాబాద్ పట్టణంలోని జన్కాపూర్ ఆర్‌ఎస్‌ఆర్ కాలనీకి చెందిన మోతిరాం తనకు వస్తన్న పెన్షన్‌ను జన్కాపూర్‌కు బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. తిర్యాణి మండలం మొర్రిగూడ గ్రామానికి చెందిన హనుమంతరావు తనకు దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని, కాగజ్‌నగర్ పట్టణం విజయబస్తీకి చెందిన మహ్మద్ ఖాజా తనకు వస్తున్న పెన్షన్ నిలిచిపోయిందని, పునరుద్ధరించాలని దరఖాస్తు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన మాన్విత తన తండ్రి ఉద్యోగం చేస్తూ మరణించినందున తనకు కారణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. కౌటాల మండలం బోదంపల్లికి చెందిన సంస్కృతి తాను కాన్పూర్ ఐఐటీలో ప్రథమ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నందున లాప్‌టాప్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. రెబ్బెన మండలం తక్కళ్లపల్లికి చెందిన బుజంగ్‌రావు తనకు జారీ చేసిన భూమి పట్టా బుక్‌లో ఎకరం భూమి తక్కువగా నమోదైందని, సవరించాలని దరఖాస్తు చేసుకున్నాడు.