Share News

kumaram bheem asifabad- దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - Jun 08 , 2026 | 10:52 PM

ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై అందిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, జిల్లా రెవెన్యూ అధికారి వేణులతో కలిసి సోమవారం అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. రెబ్బెన మండల కేంద్రానికి చెందిన కౌశిక్‌ కళ్యాణ్‌ తనకు దివ్యాంగ పెన్షన్‌ ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

kumaram bheem asifabad- దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
స్వీకరిస్తున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై అందిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, జిల్లా రెవెన్యూ అధికారి వేణులతో కలిసి సోమవారం అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. రెబ్బెన మండల కేంద్రానికి చెందిన కౌశిక్‌ కళ్యాణ్‌ తనకు దివ్యాంగ పెన్షన్‌ ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. సిర్పూర్‌(టి) మండలం కొమ్ముగూడ గ్రామానికి చెందిన దుర్గం హోక్టు తనకు చెందిన వ్యవసాయ భూమిని కైలుకు ఇస్తే కబ్జా చేసుకున్నాడని, తిరిగి ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశాడు. కాగజ్‌నగర్‌ మండలం నజ్రుల్‌నగర్‌కు చెందిన కవిత మండల్‌ తన భర్త ఎల్‌ఐసీలో బీమా ప్రీమియం తీసుకొని మరణించారని, భీమా డబ్బులు ఇప్పించాలని, ఆసిఫాబాద్‌ మండలం గుండి గ్రామానికి చెందిన నవీన్‌ తనకు వస్తున్న చేయూత పెన్షన్‌ డబ్బులు బ్యాంకు ద్వారా ఇప్పించాలని దరఖాస్తు అందజేశారు. కాగజ్‌నగర్‌ మండలం అంకుశాపూర్‌ గ్రామానికి చెందిన కమలాబాయి తనకు చెందిన భూమిలో అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నారని ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని దరఖాస్తు అందజేసింది. చింతలమానేపల్లి మండలం కర్జెల్లి గ్రామానికి చెందిన శంకరయ్య గతంలో వచ్చిన చేయూత పెన్షన్‌ రెండు నెలలుగా రావడం లేదని, పునరుద్ధరించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. బెజ్జూరు మండలం రెబ్బెన గ్రామానికి చెందిన మల్లేష్‌ తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించాడు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈవీఎం గోదాం వద్ద పటిష్ట భద్రత

ఆసిఫాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాల గోదాం వద్ద పటిష్టమైన భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాలు భద్ర పరిచిన గోదాంను సోమవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈవీఎం గోదాం వద్ద 24 గటల పాటు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించామని తెలిపారు. గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు జమీల్‌, నాయబ్‌ తహసీల్దార్‌ శ్యాంలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2026 | 10:52 PM