Share News

త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - Apr 20 , 2026 | 11:26 PM

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తు లను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ కె హరిత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆర్డోవో లోకేశ్వర్‌రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అనంతరం అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

 త్వరగా పరిష్కరించాలి
దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తు లను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ కె హరిత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆర్డోవో లోకేశ్వర్‌రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అనంతరం అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జైనూరు మండలం దబోలి గ్రామానికి చెందిన మారుబాయి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు. రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన పూజిత ఇందిరమ్మ ఇల్లు లిస్టు మూడులో ఉన్న తన పేరును లిస్టు ఒకటికి మార్పు చేయాలని దరఖాస్తు చేసుకుంది. లింగాపూర్‌ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రాథోడ్‌ కృష్ణ తనకు చెందిన లావుణి పట్టా భూమిలో వ్యవసాయం చేయుటకు బోర్‌వెల్‌, విద్యుత్తు సౌకర్యం కల్పించాలని దరఖాస్తు చేసుకున్నాడు. వాంకిడి మండలం చౌపన్‌గూడ గ్రామానికి చెందిన ఆత్రం అన్నిగ తమ గ్రామంలో విద్యుత్తు సమస్యను పరిష్కరించాలని విన్నవిం చాడు. చింతలమానేపల్లి మండలం రణవెల్లి గ్రామానికి చెందిన సర్పంచ్‌, వార్డు సభ్యులు తమ గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలకు అదనపు తరగతులు మంజూరు చేయాలని దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అఽధికారులు అర్జీదారుల నుంచి వచ్చిన దరఖాస్తులు పరిశీలించి ఎప్పటికప్పుడు పరిషరిం చాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలి

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్‌ మధర్‌ ఎర్త్‌ పోర్టు, నైట్‌ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈనెల 15నుంచి 30వరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజలను చైతన్యవంతులుగా చేయాలని అన్నారు. భూమి సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, నేల సంరక్షణ, ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించడం, సేంద్రీయ ఎరువుల వినియోగం వంటి చర్యలు పర్యావరణానికి దోహదపడతాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ హరత దళం రీజనల్‌ ప్రాజెక్టు అధికారి విద్యాసాగర్‌, జిల్లా సమన్వయ కర్త మదూకర్‌లు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 07:44 AM