kumaram bheem asifabad-దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Jan 12 , 2026 | 10:29 PM
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి సోమవారం అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని సంఘం బస్తీకి చెందిన సాహన్ మహ్మద్ తనకు చేయూత పింఛన్ మంజూరు చేయాలని అర్జీ సమర్పించాడు.
ఆసిఫాబాద్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి సోమవారం అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని సంఘం బస్తీకి చెందిన సాహన్ మహ్మద్ తనకు చేయూత పింఛన్ మంజూరు చేయాలని అర్జీ సమర్పించాడు. జైనూరు మండలం పార గ్రామానికి చెందిన అత్రం నిర్మల తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించింది. రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన రైతులు వట్టివాగు కాలువను కొంతమంది అక్రమంగా అక్రమించుకుంటున్నారని ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని అర్జీ సమర్పించారు. వాంకిడి మండలం నవేగాం సర్పంచ్ సుజాత తమ గ్రామానికి రహదారి మంజూరు చేసి రహదారి సౌకర్యం కల్పించాలని అర్జీ సమర్పించాడు. నజ్రూల్‌నగర్‌కు చెందిన చంద్రకాంత్ మేస్త్రీ తనకు జారీ చేసిన పట్టాదార్ పాస్‌పుస్తకంలో విస్తీర్ణం సవరణ చేయాలని దరఖాస్తు అందజేశాడు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై వస్తున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి స్థలం గుర్తింపు
ఆసిఫాబాద్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ నియోజకవర్గానికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి 35 ఎకరాల స్థలాన్ని వాంకిడి మండలంలో గుర్తించామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. హైదరాబాద్ నుంచి మంత్రి లక్ష్మణ్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్ఱధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార, సుల్తానియా, టీజీఈడబ్ల్యూ ఐడీసీఎండీ గణపతిరెడ్డిలతో కలిసి. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులు వేగవంతం చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని వీసీ హాల నుంచి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ ఆసిఫాబాద్ నియోజకవర్గానికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి 35 ఎకరాల స్థలాన్ని వాంకిడి మండలంలో గుర్తించామని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.సమావేశంలో టీజీఈడబ్ల్యూ ఐడీసీఈఈ రవీందర్, డిప్యూటీ ఈఈ వెంకటేశ్వర్లు, జిల్లా భూ కొలతల అధికారి విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.