Share News

kumaram bheem asifabad- దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 24 , 2026 | 10:48 PM

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, డీఆర్వో వేణుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సిర్పూర్‌(టి) మండల కేంద్రానికి చెందిన షకీల్‌హుస్సేన్‌ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కాటరీంగ్‌ సప్లయ్‌ చేసిన దానికి సంబంధించిన బిల్లుల చెల్లింపు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశాడు.

kumaram bheem asifabad-  దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
దరఖాస్తులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌

ఆసిఫాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి):ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, డీఆర్వో వేణుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సిర్పూర్‌(టి) మండల కేంద్రానికి చెందిన షకీల్‌హుస్సేన్‌ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కాటరీంగ్‌ సప్లయ్‌ చేసిన దానికి సంబంధించిన బిల్లుల చెల్లింపు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశాడు. జైనూరు మండలం దూరతాండ గ్రామ ప్రజలు తమ గ్రామంలో పని చేస్తున్న ఆశా కార్యకర్తను తొలగించాలని అర్జీ సమర్పించారు. రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన రైతులు తమ ఆర్వోఎఫ్‌ఆర్‌ భూముల్లో బోర్లు వేశామని విద్యుత్‌ సరఫరా అందించాలని దరఖాస్తు చేశారు. దహెగాం మండలం కుమ్మరపల్లి గ్రామానికి చెందిన సురేష్‌ తన తండ్రి పేరిట గల భూమిని తన పేరిట విరాసత్‌ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంబందితశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటే లక్ష్యాన్ని వేగవంతం చేస్తాం

ఆసిఫాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): మొక్కలు నాటే లక్ష్యాన్ని వేగవంతం చేస్తామని అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. . హైదరాబాద్‌ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా నిర్ధేశించిన మొక్కలు నాటే లక్ష్యాన్ని వేగవంతం చేయాలని అన్నారు రాష్ట్రంలో 2026-27 సీజన్‌లో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలకు కేటాయించిన లక్ష్యాల ప్రకారం మొక్కలు నాటే కార్యక్రమం త్వరగా పూర్తి చేయాలన్నారు. నాటిన ప్రతి మొక్కకు జియో టాగింగ్‌ చేసి సంరక్షించాలని తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన 47 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని అధికారుల సమన్వయంతో త్వరలో పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ స్థలాలు, రహదారులకిరువైపులా, చెరువుగట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల అవరణలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో జిల్లా అటవీ అధికారి బాలామణి, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 10:48 PM