kumaram bheem asifabad- దరఖాస్తులు పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 12 , 2026 | 10:22 PM
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా అధికారులు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ప్రజావాణి దరఖాస్తుల పరిశీలన, కంప్యూటర్ డేటా ఎంట్రీ, నమోదు, శిక్షణ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా అధికారులు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ప్రజావాణి దరఖాస్తుల పరిశీలన, కంప్యూటర్ డేటా ఎంట్రీ, నమోదు, శిక్షణ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయిలలో ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. బాధితులకు అర్థమయ్యే రీతిలో సత్వరమే వివరాలు అందించాలని ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్ర మానికి అన్ని శాఖల అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని సూచించా రు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, సెక్షన్ సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఈడీఎం తదితరులు పాల్గొన్నారు.