Share News

టీ-సేవల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Apr 27 , 2026 | 05:28 AM

నేషనల్‌ స్కిల్‌ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా టీ- సేవా ఆన్‌లైన్‌ డెవల్‌పమెంట్‌ స్కిల్‌ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్‌...

టీ-సేవల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

బర్కత్‌పుర, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): నేషనల్‌ స్కిల్‌ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా టీ- సేవా ఆన్‌లైన్‌ డెవల్‌పమెంట్‌ స్కిల్‌ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్‌ అడప వెంకట్‌రెడ్డి తెలిపారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలు, మండలాలు, మునిసిపాలిటీలు, నగరాలకు చెందిన అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆసక్తి గల వారు మే 5వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం 8179955744 నంబర్‌ను సంప్రదించాలని డైరెక్టర్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Apr 27 , 2026 | 05:28 AM