Share News

kumaram bheem asifabad-హెచ్‌పీవీ టీకాపై అనాసక్తి

ABN , Publish Date - Apr 28 , 2026 | 11:08 PM

బాలికల్లో గర్భాశయ ముఖద్వార(సర్వేకల్‌) క్యాన్సర్‌ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా అందుబాటు లోకి తీసుకొచ్చిన హెచ్‌పీవీ (హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌) టీకా పంపిణీ కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. దీనిపై అవగాహన లేక చాలా మంది బాలికలు టీకా తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.

kumaram bheem asifabad-హెచ్‌పీవీ టీకాపై అనాసక్తి
బెజ్జూరులో బాలికలకు టీకా వేస్తున్న వైద్య సిబ్బంది(ఫైల్‌)

బెజ్జూరు, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): బాలికల్లో గర్భాశయ ముఖద్వార(సర్వేకల్‌) క్యాన్సర్‌ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా అందుబాటు లోకి తీసుకొచ్చిన హెచ్‌పీవీ (హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌) టీకా పంపిణీ కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. దీనిపై అవగాహన లేక చాలా మంది బాలికలు టీకా తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నియంత్రణకు ప్రభుత్వాలు 14,15ఏళ్ల బాలికలకు ఉచితంగా టీకా పంపిణీ ప్రారంభించాయి. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు.

- ఆశించిన స్పందన కరువు..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న రోజు టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రభు త్వం ప్రారంభించింది. అధికారులు అర్హులైన బాలికల ను గుర్తించారు. కానీ వారి కుటుంబ సభ్యుల కు క్యాన్సర్‌తో కలిగే అనారోగ్య సమస్యలపై అవగా హన కల్పించకపోవడంతో టీకా తీసుకునేందుకు బాలికలు ముందుకు రావడం లేదు. జిల్లాలోని వసతి గృహాలు, సెకండరీ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల రికార్డు ల ప్రకారం జిల్లాలో 3,980మంది అర్హులు ఉన్నట్లు గుర్తించారు. ఇందుకోసం జిల్లాలో 24ఆరోగ్య కేంద్రాల్లో టీకా లను అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు 430మంది మాత్రమే టీకాలు తీసుకున్నారు. జిల్లా లోని వివిద ఆసుపత్రుల్లో టీకాలు పంపిణీ చేసినా ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదు.

ప్రయోజనాలు ఇలా..

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ సమస్యతో చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో సంభవించే మా ర్పులతో కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి.. వాటిని సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉందని సూచిస్తున్నా రు. క్యాన్సర్‌ను అరికట్టేందుకు హెచ్‌పీవీ టీకా బాగా పని చేస్తుందని చెబుతున్నారు. టైప్‌-16,18,6,11 రకా ల నుంచి ఈ టీకా రక్షణ కల్పిస్తుంది. ప్రైవేటు దుకా ణాల్లో ఈ టీకా ధర రూ.2500నుంచి రూ.10వేల వరకు ఉంటుందంటున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి..

- సీతారాం, డీఎంహెచ్‌వో

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కోసం ఇచ్చే హెచ్‌ పీవీ టీకాను సద్వినియోగం చేసుకోవాలి. 14, 15ఏళ్ల బాలికలు తప్పనిసరిగా టీకాలు వేసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాలికలకు ఉచితంగా టీకా పంపిణీ కొనసాగుతోంది. జిల్ల్లాలో అర్హులైన బాలికలు 3,980 మంది ఉన్నట్లు గుర్తించాం. టీకాపై అవగాహన కలి గించి భవిష్యత్తులో క్యాన్సర్‌ రాకుండా చర్యలు తీసుకుంటాం.

Updated Date - Apr 28 , 2026 | 11:08 PM