Share News

ముగ్గురు నిందితులకూ 3 రోజుల కస్టడీ

ABN , Publish Date - Jul 16 , 2026 | 05:38 AM

మద్యం రవాణాలో అక్రమాలు, ఆర్థిక లావాదేవీల కేసు కేసులో నిందితులైన రాష్ట్ర బేవరేజేస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ డి.వాసుదేవరెడ్డి, రాజ్‌ కసిరెడ్డి, కారుమూరు సునీల్‌కుమార్‌లను మూడ్రోజులపాటు..

ముగ్గురు నిందితులకూ 3 రోజుల కస్టడీ

  • మద్యం రవాణా కేసులో కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సునీల్‌ను విచారించనున్న ఈడీ

హైదరాబాద్‌, జూలై 15(ఆంధ్రజ్యోతి): మద్యం రవాణాలో అక్రమాలు, ఆర్థిక లావాదేవీల కేసు కేసులో నిందితులైన రాష్ట్ర బేవరేజేస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ డి.వాసుదేవరెడ్డి, రాజ్‌ కసిరెడ్డి, కారుమూరు సునీల్‌కుమార్‌లను మూడ్రోజులపాటు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లిలోని ఈడీ కేసుల ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం నుంచి 18వ తేది సాయంత్రం వరకు ఈడీ వారిని విచారించాల్సి ఉంటుంది. మద్యం రవాణా స్కాంకు సంబంధించి ఇటీవల ఈడీ అధికారులు ఏపీ, తెలంగాణ ల్లో విస్తృత సోదాలు నిర్వహించి.. ఈ ముగ్గురినీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మద్యం సరఫరా ఒప్పందాలు, డిస్టిలరీల ఎంపిక, ఆర్థిక లావాదేవీలు, షెల్‌ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు, కీలక వ్యక్తుల పాత్రపై విచారణ జరపాల్సి ఉందని ఈడీ అధికారులు పేర్కొంటున్నారు. మద్యం విధానం అమలు సమయంలో తీసుకున్న నిర్ణయాలు, కమీషన్ల వ్యవహరం, నిధుల బదిలీపై ముగ్గురినీ ప్రశ్నించనున్నారు.

Updated Date - Jul 16 , 2026 | 05:40 AM