Share News

ప్రజాభవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Mar 15 , 2026 | 06:12 AM

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ప్రజాభవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు

  • భట్టి కుమారుడు, కోడలిని ఆశీర్వదించిన ఏపీ సీఎం

హైదరాబాద్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భట్టి కుమారుడు సూర్య విక్రమాదిత్య, కోడలు సాక్షిలను ఆశీర్వదించి, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు భట్టి విక్రమార్క, నందిని దంపతులు పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఈనెల 5న శంషాబాద్‌లో సూర్య విక్రమాదిత్య, సాక్షిల వివాహం జరిగింది. అయితే వివాహానికి హాజరుకాలేకపోయిన చంద్రబాబు, ప్రత్యేకంగా ప్రజాభవన్‌కు వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. వారి వెంట తెలంగాణ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి కూడా ఉన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 06:13 AM