Share News

జాలా గుట్టలో ఇష్టారాజ్యం...!

ABN , Publish Date - Nov 03 , 2026 | 11:13 PM

అక్రమ క్వారీ నిర్వాహకుల దన దాహానికి ఓ కొండ కరిగిపో తోంది. ఎలాంటి అనుమతులు లేకపోయినా అక్రమం గా యంత్రాల సహాయంతో క్వారీ నిర్వహిస్తూ గు ట్టను తవ్వుతున్నారు. నిత్యం దాదాపు 40 నుంచి 50 ట్రాక్టర్ల ద్వారా బండరాయిని తరలించుకుపోతున్నా అడిగేవారు కరువయ్యారు.

జాలా గుట్టలో ఇష్టారాజ్యం...!

-అనుమతుల్లేకున్నా క్వారీ నిర్వహణ

-పెద్ద ఎత్తున తరలిపోతున్న బండ, మొరం

-జిల్లా కేంధ్రంలో జోరుగా సాగుతున్న అక్రమ దందా

-చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న మైనింగ్‌ శాఖ

మంచిర్యాల, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): అక్రమ క్వారీ నిర్వాహకుల దన దాహానికి ఓ కొండ కరిగిపో తోంది. ఎలాంటి అనుమతులు లేకపోయినా అక్రమం గా యంత్రాల సహాయంతో క్వారీ నిర్వహిస్తూ గు ట్టను తవ్వుతున్నారు. నిత్యం దాదాపు 40 నుంచి 50 ట్రాక్టర్ల ద్వారా బండరాయిని తరలించుకుపోతున్నా అడిగేవారు కరువయ్యారు. జిల్లా కేంద్రంలోని అండాళమ్మ కాలనీ సమీపంలో, మున్సిపల్‌ డంప్‌ యార్డు వద్ద ఉన్న జాలా గుట్టలో గత కొంతకాలంగా అక్రమ క్వారీ కొనసాగు తోంది. పట్ట పగలే గుట్టను తొలుస్తూ బండ రాయిని త రలించుకు పోతున్నా సంబంధిత అధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం. గుట్టలు, కొండల్లో బండరాళ్లు, మొరం తవ్వకాలపై ఎప్పటికప్పుడు నిఘా వేసి సంబం ధిత అధికారులను అప్రమత్తం చేయాల్సిన నిఘా విభా గం నిర్వీర్యం కావడంతోనే అక్రమ తవ్వకాలు యథే శ్చగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

అనుమతులు లేకున్నా తవ్వకాలు...

జాలా గుట్టలో బండ, మొరం తవ్వకాలకు సంబం ధించి గనులు, భూగర్భ శాఖ నుంచి ఎలాంటి అనుమ తులు లేవు. రాత్రుల్లో యంత్రాల సహాయంతో గుట్టను తొలుస్తున్న అక్రమార్కులు, పగటిపూట తవ్విన బండ, మొరాన్ని ట్రాక్టర్లలో నింపి తరలిస్తున్నారు. బండ రాళ్ల ను నేరుగా తరలిస్తుండగా, మొరాన్ని గుట్ట సమీపంలో నిల్వ చేసి, అదును చూసుకొని ఇతర ప్రాంతాలకు స రఫరా చేస్తున్నారు. అక్రమ తవ్వకాల కారణంగా గుట్ట దాదాపు నేల మట్టం కాగా, నాలుగైదు మీటర్ల లో తుగల పెద్ద గుంతలతో ఆ ప్రాంతమంతా ప్రమాద కరంగా తయారైంది. వర్షాకాలంలో ఆ గుంతల్లో నీరు నిలిస్తే...అటవీ ప్రాంతంలో గడ్డి కోసం వెళ్లే పశువులు, ప్రజలకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. జా లా గుట్టలో పై భాగంలో రిజర్వు ఫారెస్టు ఉండగా, అ టవీశాఖ హద్దులు ఏర్పాటు చేసింది. ఆ హద్దులను ఆనుకొని తవ్వకాలు సాగిస్తున్నారు. తవ్వకాలు జరిపే చోట గుట్ట వద్ద సంబంధిత యువకులు పదుల సం ఖ్యలో గుమిగూడి ఉంటూ, అటు వైపు ఇతరులెవరూ వెళ్లకుండా కాపలా కాస్తున్నారు. పట్టపగలే ఈ తతం గం నడుస్తుండగా, అధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం.

భారీ సంపాధన...

జాలా గుట్టలో అక్రమ తవ్వకాల కారణంగా పెద్ద మొత్తంలో బండరాయి, మొరం తరలిపోతుండగా, ని ర్వాహకులకు భారీగా సంపాదన ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమ క్వారీలు కనుక ఎలాంటి ట్యాక్స్‌లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం నిర్వాహకులకు లేదు. నిత్యం 50 ట్రాక్టర్ల వరకు బండ తరలిస్తుండగా, ఒక్కో ట్రి ప్పు నకు రూ. 1500 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోం ది. అదే మొరం ట్రిప్పు ఒక్కంటికి రూ. 2000 వరకు ధర పలుకుతోంది. అలా వెలికి తీసిన బండరాయి, మొ రాన్ని క్వారీల నిర్వాహకులు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, భవన నిర్మాణాలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుం టు న్నారు. అలా నిత్యం రూ. 50 వేల నుంచి లక్ష వరకు అక్రమంగా సంపాధిస్తున్న క్వారీల నిర్వాహకులు ప్రభు త్వ ఖజానాకు మాత్రం తూట్లు పొడుస్తున్నారు. క్వారీ ల్లో అధిక తవ్వకాల కారణంగా భవిష్యత్తులో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉందని పలువురు పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారీతిన కొండలు, గుట్టలు తరలిపోతుండటంతో పెద్ద మొత్తంలో ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా అర్థరాత్రులు యంత్రాల సహాయంతో తవ్వకాలు జరుపుతుండటంతో విపరీతమై న శబ్దం కారణంగా ఇబ్బందులు పడవలసి వస్తుందని అండాళమ్మ కాలనీ వాసులు వాపోతున్నారు. దాదాపు నెల రోజుల నుంచి గుట్టను అక్రమంగా తవ్వుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదంటూ ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.

నీటి ట్యాంకు వరకు తవ్వకాలు...

మంచిర్యాల నగర ప్రజలకు రక్షిత మంచినీరు అం దించేందుకు జాలా గుట్టపై మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా ఓవర్‌ హెడ్‌ ట్యాంకును నిర్మించారు. అందు లో నీటిని నింపి వివిధ ప్రాంతాల్లో ఉన్న రిజర్వా యర్లకు పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. జాలా గుట్టలో జరుగుతున్న అక్రమ తవ్వకాలు ప్రస్తుతం ఓ వర్‌ హెడ్‌ ట్యాంకు సమీపంలోకి వెళ్లాయి. గుట్టలో త వ్వకాల కారణంగా నీటి ట్యాంక్‌కు ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాలను కాలనీ వాసులు వ్యక్తం చే స్తున్నారు. తవ్వకాలు మరింత ముందుకు వెళితే ట్యాం కు కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. అలాగే స్థాని కంగా ఉన్న స్మశాన వాటిక సమీపంలో కూడా పెద్ద మొత్తంలో బండ, మొరం తవ్వకాలు జరుపుతూ య థేశ్చగా తరలిస్తున్నారు. ఇప్పటికైనా మైనింగ్‌, రెవెన్యూ శాఖల అధికారులు స్పందించి జాలా గుట్టలో అక్రమం గా జరుగుతున్న తవ్వకాలను అడ్డుకోవడంతోపాటు బా ఽధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Updated Date - Nov 03 , 2026 | 11:13 PM