Share News

ఏ శాఖ ఇచ్చినా నా మార్కు చూపిస్తా: వివేక్‌

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:39 AM

తన చేతిలో ఏ మంత్రిత్వ శాఖ ఉన్నా తనదైన మార్కుతో పనిచేస్తానని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి జీ వివేక్‌ వెంకటస్వామి చెప్పారు.

ఏ శాఖ ఇచ్చినా నా మార్కు చూపిస్తా: వివేక్‌

  • మంత్రిగా ఏడాది పూర్తి.. మీడియాతో ఇష్టాగోష్ఠి

హైదరాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): తన చేతిలో ఏ మంత్రిత్వ శాఖ ఉన్నా తనదైన మార్కుతో పనిచేస్తానని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి జీ వివేక్‌ వెంకటస్వామి చెప్పారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి సోమవారానికి ఏడాది పూర్తయిన సందర్భంగా సచివాలయంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. త్వరలో మంత్రుల శాఖలు మారుతాయన్న వార్తల నేపథ్యంలో మీరు ఏ శాఖను కోరుకుంటున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఏ శాఖ ఇచ్చినా ఇబ్బంది లేదని, అందులో లీనమై పనిచేస్తానని చెప్పారు. మంత్రిగా ఏడాది పదవీకాలంలో గిగ్‌ వర్కర్ల చట్టం తెచ్చామని, కార్మికులకు కనీస వేతనాలను అమలు చేశామని, ఇసుక విక్రయాల ద్వారా రూ.738 కోట్లు ఉన్న రాబడిని రూ.1,008 కోట్లకు పెంచామని తెలిపారు. రాష్ట్రంలో జర్మన్‌ భాష శిక్షణ కేంద్రాన్ని ఈ నెల 15న ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రాణహిత ప్రాజెక్టుపై చర్చించడానికి మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్‌ ఇప్పించే బాధ్యత బీజేపీ నేతలదేనని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం సబబేనని అన్నారు.

Updated Date - Jun 09 , 2026 | 04:39 AM