Share News

kumaram bheem asifabad- చివరి మజిలీకి చింతే

ABN , Publish Date - Sep 20 , 2026 | 10:19 PM

జిల్లాలో వైకుంఠధామాలు సమస్యలకు వేధికలుగా మారాయి. అంత్యక్రియలు చేసేందుకు సరిపడా స్థలాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మౌలిక వసతులు కానరావడం లేదు. అంత్యక్రియల అనంతరం స్నానాలు చేసేందుకు నీరు కరువైంది. రూ.కోట్లు ఖర్చు చేసి వైకుంఠధామాలు నిర్మించినా నిర్వహణను పట్టించుకునేవారే లేకుండా పోయారు. జిల్లాలోని పలు గ్రామాల్లో నిర్మాణాలు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఎందుకు పనికిరావడం లేదన్న విమర్శలున్నాయి.

kumaram bheem asifabad- చివరి మజిలీకి చింతే
లోగో

- నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారిన వైనం

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వైకుంఠధామాలు సమస్యలకు వేధికలుగా మారాయి. అంత్యక్రియలు చేసేందుకు సరిపడా స్థలాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మౌలిక వసతులు కానరావడం లేదు. అంత్యక్రియల అనంతరం స్నానాలు చేసేందుకు నీరు కరువైంది. రూ.కోట్లు ఖర్చు చేసి వైకుంఠధామాలు నిర్మించినా నిర్వహణను పట్టించుకునేవారే లేకుండా పోయారు. జిల్లాలోని పలు గ్రామాల్లో నిర్మాణాలు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఎందుకు పనికిరావడం లేదన్న విమర్శలున్నాయి. వాటి నిర్వహణను గాలికొదిలేయడంతో కష్టాలు ఇక షరా మామూలే......తమవారు చనిపోయిన బాదలో ఉన్నవాళ్లకు మరింత బాదను కలిగించేలా వైకుంఠధామాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పల్లెల్లో నిర్మించిన వైకుంఠధామాల పరిస్థితి ప్రస్తుతం అద్వాన్నంగా తయారైంది. గత ప్రభుత్వ హయాంలో ఉపాధిహామీ పథకం కింద 2018-19లో ఒక్కోదానికి నిర్మాణం కోసం రూ.12లక్షలు మంజూరు చేసింది. ఆసిపాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు చాలా గ్రామాల్లో అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్నపాటి సమస్యలను పరిష్కరిస్తే చాలా వరకు వినియోగంలోకి వస్తాయి. కానీ అధికారులు మాత్రం వీటిపై దృష్టి సారించని కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు.

- పల్టెప్రగతిలో భాగంగా..

పల్లెప్రగతిలో భాగంగా ప్రతీ గ్రామంలోనూ వైకుంఠధామం నిర్మించారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలతో పాటు దాతల నుంచి సేకరించిన భూములను ఇందుకోసం కేటాయించారు. సొంతభూములు లేనివారికి ఇవి ఉపయోగపడతాయని బావించారు. దహనం చేసే గద్దెలతో పాటు స్నానాల గదులు, హాల్‌ నిర్మించారు. నీటి సౌకర్యం కోసం బోర్లు కూడా వేశారు. అయితే విద్యుత్‌ సౌకర్యం లేక బోర్లు పనిచేయడం లేదు. వైకుంఠధామాల వద్ద లైట్లు వెలగకపోవడంతో భయాందోళనకు గురవుతున్నారు. వైకుంఠధామాలకు వెళ్లడానికి దారులు లేక అంత్యక్రియలకు సైతం అటువైపు చూడటం లేదు. దీంతో గద్దెల చుట్టూ పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. గదులు, స్నానాల గదులు ద్వంసమవుతున్నాయి. దీంతో నిర్వహణ లేక లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతున్నది.

- జిల్లా వ్యాప్తంగా..

జిల్లాలో 15మండలాల పరిదిధిలో 335గ్రామపంచాయతీలు ఉన్నాయి. అన్ని పంచాయతీల పరిదిలో వైకుంఠధామాలను నిర్మించారు. అయితే వాటి నిర్వహణపై అధికఆర యంత్రాంగం దృష్టి సారించకపోవడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. వైకుంఠధామాల నిర్వహణ అస్తవ్యస్తవంగా మారడంతో గ్రామాల్లో ఎవరైనా చనిపోతే గ్రామాల సమీపంలో వాగులు, చెరువుల వద్ద అంత్యక్రియలను చేస్తున్నారు. రూ.లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామాలు అలంకారప్రాయంగా మారాయి. లక్షలు వెచ్చించినా వినియోగంలో లేకపోవడం, వాటి నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పల్లెల్లో సైతం ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు రావడంతో అన్ని భూముల్లోనూ వ్యవసాయ పంటలు సాగు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో దహన సంస్కారాలకు చోటులేకుండా పోయింది. ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వం గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మిస్తే ప్రజలకు మేలు కలుగుతుందన్న అభిప్రాయంతో ఏర్పాటు చేసినా ప్రస్తుతం పట్టించుకోక పోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్నతాధికారులు వీటిని వినియో గంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Sep 20 , 2026 | 10:19 PM