కార్మిక వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలి
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:11 PM
కార్మిక, రైతు వ్యవస్థను విచ్ఛిన్నం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీచట్టం, విద్యుత్ సవరణచట్టం, లేబర్ కోడ్ బిల్లులను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్
నాగర్‌కర్నూల్‌టౌన్, జనవరి19 (ఆంధ్రజ్యోతి) : కార్మిక, రైతు వ్యవస్థను విచ్ఛిన్నం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీచట్టం, విద్యుత్ సవరణచట్టం, లేబర్ కోడ్ బిల్లులను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ, రైతు సంఘా ల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు కేంద్ర ప్రభు త్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్‌ల బిల్లును ఉప సంహరించి కార్మికు లు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను పునరు ద్ధరించాలని, వీబీజీరాంజీ బిల్లును రద్దుచేసి మహా త్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చే యాలని, విద్యుత్‌సవరణ బిల్లును రద్దుచేసి రైతుల ప్ర యోజనాలను కాపాడాల ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జి ల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, సీఐటీయూ జి ల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, సీపీఎం అను బంధ సంఘాల నాయకులు పి.నరసింహ, ఎం. శ్రీనివాసులు, దేశ్యానాయక్, పొదిల రామయ్య, శివవర్మ, బాలస్వామి, శివరాములు, పార్వ తమ్మ, మాసమ్మ జయలక్ష్మి, శిరీష, వెంకటేష్, మధు, తారాసింగ్, రామకృష్ణ, కాశీం, తిరుపత య్య, శాంతయ్య, బాలస్వామి, వెంకటయ్య, కృష్ణ య్య, అలివేల, కృష్ణమ్మ పాల్గొన్నారు.