Share News

రైతు వ్యతిరేక విధానాలు తగవు

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:59 AM

రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జక్క రాఘవేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షు డు జనగాం పాండు, మాజీ ఎంపీపీ కేశవపట్నం రమేశ్‌, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ బల్గూరి మధుసూదన్‌రెడ్డి అన్నారు.

రైతు వ్యతిరేక విధానాలు తగవు
భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలో రాస్తారోకో నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

భువనగిరి రూరల్‌, మార్చి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జక్క రాఘవేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షు డు జనగాం పాండు, మాజీ ఎంపీపీ కేశవపట్నం రమేశ్‌, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ బల్గూరి మధుసూదన్‌రెడ్డి అన్నారు. రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని నాగిరెడ్డిపల్లిలో రైతులతో కలిసి సోమవారం రాస్తారోకో చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. యా సంగి పంటకు సకాలంలో యూరియా సరఫరా చేయకుండా యాప్‌ ద్వారా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. సుమారు గంట పాటు రాస్తారోకో చేయడంతో భువనగిరి- చిట్యాల ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు ఆందోళనకారులకు సర్ధిచెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ నాయకు లు జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డికి వినతిపత్రం అందజేశా రు. కార్యక్రమంలో సర్పంచులు ర్యాకల సంతోష శ్రీనివాస్‌, నీల ఓం ప్రకాశ్‌గౌడ్‌, పడాల వెంకటేశ్వర్లు, శంకరయ్య, నాగెల్లి గిరిజ రమేశ్‌గౌడ్‌, కొండూరి ధనమ్మ సత్యనారాయణ, సుబ్బురు రమేశ్‌, వెంకట్‌, బుచ్చిరెడ్డి, మల్లికార్జున్‌, ధనుంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 12:59 AM