Share News

కొత్త ఓటుకు మరో ఛాన్స్‌

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:55 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఫారం-6,7,8 దరఖాస్తుల గడువు అక్టోబరు 7వ తేదీతో ముగిసింది. రెండు నియోజకవర్గాల్లో వచ్చిన 66,828 దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. ఇందులో కొత్తగా ఓటు హక్కు

కొత్త ఓటుకు మరో ఛాన్స్‌

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఫారం-6,7,8 దరఖాస్తుల గడువు అక్టోబరు 7వ తేదీతో ముగిసింది. రెండు నియోజకవర్గాల్లో వచ్చిన 66,828 దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. ఇందులో కొత్తగా ఓటు హక్కు పొందేందుకు, జాబితాలో తప్పులు సరిదిద్దుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. దరఖాస్తులన్నీ పకడ్బందీగా పరిశీలన జరిపిన అనంతరం నవంబరు 9న తుది ఓటర్‌ జాబితాను విడుదల చేయన్నారు. ఇప్పటికే జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో 3.33 లక్షల మంది ఓటర్లను తుది ఓటర్‌ జాబితాకు అర్హులుగా గుర్తించారు. జిల్లాలో మరణించిన వారు, శాశ్వతంగా వెళ్లినవారు, డబుల్‌ ఓట్లు, నోటీసులకు విచారణకు సంబంధించి 59,362 ఓట్లు తొలగిపోనున్నాయి. ఓటర్‌ జాబితాలో తప్పులు సరిచేసుకోవడానికి, జాబితాలో ఓటు ఉండే విధంగా చేసుకున్న దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుండగా కొత్తగా ఓటు హక్కు పొందడానికి గురువారం, శుక్రవారం రెండు రోజులు జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే యువతి,యువకులతో పాటు జాబితాలో పేరు గల్లంతైన అర్హులైన పౌరులకు ఇది మంచి అవకాశంగా చెబుతున్నారు. ఎన్నికల సమయం వరకు ఎదురుచూడకుండా ముందుగానే తొలి ఓటర్‌ జాబితాలో తమ పేరు ఉండే విధంగా ఓటర్‌ జాబితాలను పరిశీలించి ప్రత్యేక శిబిరాల్లో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొత్త వారు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఫారం-6 సమర్పించడం ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవడానికి వీలు ఉంటుంది. శిబిరాల్లో బూత్‌ స్థాయి అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్‌ సాయి ఏజెంట్లు అందుబాటులో ఉంటారు.

ఓటర్‌ జాబితా సవరణకు భారీగా దరఖాస్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఓటర్‌ జాబితా సవరణ కోసం ఆగస్టు 17 నుంచి అక్టోబరు 7వ తేదీ వరకు వరకు 66,828 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కొత్త ఓటరు ఫారం-6 కింద 2,583 దరఖాస్తులు, ఓటర్ల తొలగింపు ఫారం-7 కింద 60,521 దరఖాస్తులు, ఓటర్ల వివరాల మార్పులు కోసం ఫారం-8 కింద 3,724 దరఖాస్తులు వచ్చాయి. వేములవాడ నియోజకవర్గంలో 36,314 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కొత్త ఓటరు ఫారం- 6 కింద 843 దరఖాస్తులు, ఓటర్ల తొలగింపు ఫారం- 7 కింద 33,300 దరఖాస్తులు, ఓటర్ల వివరాల మార్పులు కోసం ఫారం-8 కింద 2,171 దరఖాస్తులు వచ్చాయి. సిరిసిల్లలో 30,514 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కొత్త ఓటరు ఫారం-6 కింద 1,740 దరఖాస్తులు, ఓటర్ల తొలగింపు ఫారం-7 కింద 27,221 దరఖాస్తులు, ఓటర్ల వివరాల మార్పుల కోసం ఫారం-8 కింద 1,553 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హత కలిగిన వారి ఓటర్లను జాబితాలో చేర్చుతున్నారు. ఓటర్‌ జాబితా సవరణలు 83,846 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారణ జరిపారు. విచారణకు 83,644 మంది హాజరయ్యారు. వీటిని పరిశీలన పూర్తి చేసి తుది ఓటర్‌ జాబితా నవంబరు 9న ప్రకటించే సమయానికి కొత్త ఓటర్లను కూడా జాబితాలో చేర్చాల్సి ఉంటుంది. ఇప్పటివరకు వేములవాడ నియోజకవర్గంలో 1.71 లక్షల మంది, సిరిసిల్ల నియోజకవర్గంలో 1.61 లక్షల మంది ఓటర్లను ఇప్పటికే తుది ఓటర్‌ జాబితాకు గుర్తించారు.

శిబిరాలను సద్విని చేసుకోవాలి

- కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

జిల్లాలో ఈనెల 15,16 తేదీల్లో రెండు రోజులు ప్రతి పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిర్వహించే శిబిరాలను సద్విని చేసుకోవాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు. ముసాయిదా ఓటర్‌ జాబితాలో పేర్లు లేని వారు, కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునే యువతి, యువకులు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం రెండు రోజులు పోలింగ్‌ కేంద్రాల వద్ద బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు.

జిల్లాలో ఫామ్‌-6,7,8 వివరాలు ఇలా..

వేములవాడ నియోజకవర్గం

మండలం ఫామ్‌-6 ఫామ్‌-7 ఫామ్‌-8

మేడిపల్లి 217 2517 137

భీమారం 28 1814 57

కథలాపూర్‌ 294 4719 170

రుద్రంగి 33 1321 42

చందుర్తి 208 3609 173

వేములవాడ రూరల్‌ 188 1595 184

వేములవాడ 425 9690 584

కోనరావుపేట 347 1956 206

మొత్తం 1740 27221 1553

సిరిసిల్ల నియోజకవర్గం

మండలం ఫామ్‌-6 ఫామ్‌-7 ఫామ్‌-8

గంభీరావుపేట్‌ 81 2836 316

ముస్తాబాద్‌ 201 3746 303

సిరిసిల్ల 93 15465 899

తంగళ్ళపల్లి 207 5571 316

వీర్నపల్లి 54 947 52

ఎల్లారెడ్డిపేట్‌ 207 4735 285

మొత్తం 843 3330 2171

Updated Date - Oct 15 , 2026 | 12:55 AM