Share News

kumaram bheem asifabad- మరో అవకాశం..

ABN , Publish Date - Nov 11 , 2026 | 10:31 PM

టరు జాబితాలో పేరు లేని వారు చింతించాల్సిన అవసరం లేదు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్‌)-2026 ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా నుండి పేర్లు గల్లంతైన, చిరునామా మారిన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఇప్పటికే ప్రచురించిన సర్‌ ముసాయిదా జాబితాలో అబ్సెంట్‌, షిప్టెడ్‌, డెడ్‌, డుప్లికేట్‌(ఏఎస్‌డీడీ)కారణాలతో పేర్లు తొలగింపుకు గురైన వారు మళ్లీ దరఖాస్తు చేసుకొవచ్చు.

kumaram bheem asifabad- మరో అవకాశం..
లోగో

- చిరునామా మారిన వారికి మార్గం సుగమం

- ఫారం-8 అవసరం లేకుండానే ప్రక్రియ

- 21 వరకు దరఖాస్తుల సమర్పణకు గడువు

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితాలో పేరు లేని వారు చింతించాల్సిన అవసరం లేదు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్‌)-2026 ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా నుండి పేర్లు గల్లంతైన, చిరునామా మారిన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఇప్పటికే ప్రచురించిన సర్‌ ముసాయిదా జాబితాలో అబ్సెంట్‌, షిప్టెడ్‌, డెడ్‌, డుప్లికేట్‌(ఏఎస్‌డీడీ)కారణాలతో పేర్లు తొలగింపుకు గురైన వారు మళ్లీ దరఖాస్తు చేసుకొవచ్చు. వీరి దరఖాస్తులను పరిశీలించి తుది జాబితాలో చేరుస్తామని ఈసీ ప్రకటించింది. గత ఆగస్టు 17న విడుదల చేసిన ముసాయిదా జాబితా జాబితా ప్రకారం కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 48,139 మంది ఏఎస్‌డీడీ(గైర్హాజరు, చిరునామా మార్పు, మృతి చెందిన, డుప్లికేట్‌)ఉన్నారు. వీరు తిరిగి ఓటరు జాబితాలో చోటు దక్కించుకునేందుకు ప్రక్రియను సులభతరం చేశారు. చిరునామా మార్పు కోసం ప్రత్యేకంగా ఫారం-8 సమర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఫారం-6 ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నవారు ఎన్యుమరేషన్‌ ఫారం సమర్పించాల్సిన అవసరంలేదు. కొత్త చిరునామాకు సంబందించిన ఆధారాన్ని సమర్పిస్తూ ఎన్యుమరేషన్‌ ఫారంలో వివరాలు నమోదు చేసుకొవచ్చు. కొత్త చిరునామా, సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం వివరాలను స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఈ వెసులుబాటుతో చిరునామా మారినవారు తిరిగి ఓటర్ల జాబితాలో చేరేందుకు అవకాశం ఏర్పడింది. ఇలాంటి వారు ఈనెల 21లోగా సంబందిత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

- సాధారణంగా..

సాధారణంగా ఓటరు జాబితాలో పేరు గల్లంతైతే మళ్లీ కొత్తగా చేరేందుకు ఫారం-6 సమర్పించడం తప్పనిసరి. అయితే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో గైర్హాజరు, చిరు నామా అందుబాటులో లేక పోవడం, మరణం, నకిలీ నమోదులు తదితర సాంకేతిక కారణాలతో పేర్లు కోల్పోయిన వారు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం నిబంధనలను సడ లించింది. ఇకపై అర్హులైన ఓటర్లు ఫారం-6 సమర్పించాల్సిన పనిలేదు. సంబంధిత ఎన్యుమరేషన్‌ పత్రంతో పాటు అవసరమైన స్వీయ ధ్రుకరణ పత్రాన్ని సమర్పిస్తే సరిపోతుందని వెల్లడించారు.

- పలు కారణాలతో..

గతంలో ఎన్యూమరేషన్‌ ఫారాలు జారీ చేసినప్పటికీ పలు కారణాలతో ముసాయిదా జాబితాలో చోటు దక్కని వారి కోసం ఈ ప్రక్రియ చేపట్టారు. క్షేత్రస్ధాయి పరిశీలన సమయంలో అందుబాటులో లేనివారు, నివాసం మారినవారు, మరణించినట్లు తప్పుగా నమోదైనవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన వారి పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో లేవని, సంబందిత పౌరులు వెంటనే తమ వివరాలను ముసాయిదా జాబితాలో సరిచేసుకొవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటుహక్కు కోల్పోయిన పౌరులు బూత్‌లెవల్‌ అధికారి, ఎన్నికల నమోదు అధికారి లేదా సహయ ఎన్నికల నమోదు అధికారిని సంప్రదించవచ్చు. వీరికి అవసరమైన పత్రాలను అందజేసి జాబితాలో పేరును పునరుద్దరించుకోవచ్చు. ఇప్పటికే ఎన్యుమరేషన్‌ పత్రం సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. నివాసం లేదా చిరునామా మారిన ఓటరు తమ కొత్త చిరునమాతో పాటు శాసనసభ నియోజకవర్గ సమాచారాన్ని స్పష్టంగా జతచేయాలి.

Updated Date - Nov 11 , 2026 | 10:31 PM