Share News

వార్షిక పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి

ABN , Publish Date - Feb 24 , 2026 | 11:16 PM

పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు పేర్కొన్నారు.

వార్షిక పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు

మంచిర్యాల కలెక్టరేట్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు పేర్కొన్నారు. మంగళవారం హై ద్రాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, అధికారులతో సమా వేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి మార్చి 16 వరకు ఇంటర్‌ పరీక్షలు, మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 16 వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయన్నారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను కల్పించాలన్నారు. ఆర్టీసీ అధికారులు పరీక్షల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలన్నారు. కలెక్టర్‌ కుమా ర్‌దీపక్‌ మాట్లాడుతూ జిల్లాలో పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ఇంటర్‌ పరీక్షల కోసం జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, డీపీ వో వెంకటేశ్వర్‌రావు, జిల్లా ఇంటర్మీ డియట్‌ అధికారి అంజయ్య, డీఈవో యాదయ్య, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి పఆల్గొన్నారు.

ఫజిల్లాలో పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అధికారులతో పరీక్షల నిర్వహణపై సమా వేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 16 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. ఇందుకోసం జిల్లాలో 48 పరీక్ష కేంద్రాల ను ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్ష సమయం ముగిసేవరకు విద్యా ర్థులను పరీక్ష కేంద్రంలోనే ఉంచాలన్నారు. పరీక్షలను సమర్ధవంతంగా ని ర్వహించేదుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. అదన పు కలెక్టర్‌ చంద్రయ్య, డీఈవో యాదయ్య, అధికారులుపాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 11:16 PM