వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:10 PM
జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ , పదవ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ సమావేశం మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ , పదవ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ సమావేశం మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి మార్చి 16 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్షల కోసం 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పదవ తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయన్నారు. పరీక్ష నిర్వహణ కోసం సిట్టింగ్, ప్లైయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించామన్నారు. పరీక్ష కేంద్రాల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలన్నారు. సంక్షేమవసతి గృహాల్లోని విద్యార్థులకు సులభంగా జీర్ణమయ్యే ఆహారం, శుధ్దమైన తాగునీటిని అందించాలన్నారు. వార్షిక పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అంజయ్య, డీఈవో యాదయ్య తదితరులు పాల్గొన్నారు.