Share News

kumaram bheem asifabad-వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Jan 30 , 2026 | 10:55 PM

ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌, వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లోని సమవేశ మందిరంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా మాధ్యమిక విద్యాశాఖ అధికారి రామ్‌దాస్‌తో కలిసి వైద్య, విద్యుత్‌, పంచాయతీ రాజ్‌, తపాలా, ఆర్టీసీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులతో శుక్రవారం వార్షిక పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad-వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌, వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లోని సమవేశ మందిరంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా మాధ్యమిక విద్యాశాఖ అధికారి రామ్‌దాస్‌తో కలిసి వైద్య, విద్యుత్‌, పంచాయతీ రాజ్‌, తపాలా, ఆర్టీసీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులతో శుక్రవారం వార్షిక పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌, వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు 15 కేంద్రాలలో రెండు సెక్షన్ల వారీగా జరుగుతాయని చెప్పారు. ఈ పరీక్షల్లో 4,691 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు కొనసాగుతాయని తెలిపారు. ఇందు కోసం జిల్లాలో 19 కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9,716 మంది హాజరు కానున్నారన్నారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన వసతులు ఉండేలా చూడాలని సూచించారు. ఆర్టీసీ అధికారులు సమయానుసారంగా బస్సులు పడాలని, వైద్య శాఖ ఆధ్వర్యంలో అవసరమైన మందులతో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని అన్నారు. జవాబు పత్రాల తరలింపులో తపాలా శాఖ సి బ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటర్‌ ప్రాక్టికల్‌ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ఈ సమావే శంలో సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు.

మీడియా సెంటర్‌ను ప్రారంభించిన కలెక్టర్‌

ఆసిఫాబాద్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మున్సిపల్‌ ఎన్నికలను పురస్కరించుకని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోని రూమ్‌ నంబరు 13లో మీడియా సెంటర్‌, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ సెల్‌ను శుక్రవారం కలెక్టర్‌ కె హరిత, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్‌ ద్వారా ప్రింట్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్‌ మీడియాకు అందించాలని సూచించారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో డీపీఆర్వో సంపత్‌కుమార్‌, కలెక్టరేట్‌ ఏవో కిరణ్‌ పాల్గొన్నారు

Updated Date - Jan 30 , 2026 | 10:55 PM