Share News

అంకం రాహుల్‌ మృతికి కారకులెవరు?

ABN , Publish Date - Jun 26 , 2026 | 05:13 AM

అంకం రాహుల్‌ కారకులెవరో తేలాలని, ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ బీసీ రాజ్యాధికార సమితి అండగా నిలుస్తుందని సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్‌ తెలిపారు.

అంకం రాహుల్‌ మృతికి కారకులెవరు?

  • 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఆమరణ దీక్ష

  • బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్‌

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): అంకం రాహుల్‌ కారకులెవరో తేలాలని, ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ బీసీ రాజ్యాధికార సమితి అండగా నిలుస్తుందని సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో అదృశ్యమై ఏపీలోని సింగరాయకొండలో అనుమానాస్పద స్థితిలో రాహుల్‌ మృతి చెందగా.. పోలీసులు చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. 15 రోజులు గడుస్తున్నా మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో గురువారం అంకం రాహుల్‌ తల్లిదండ్రులు రాజేశ్వర్‌, వనితతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పైవ్రేట్‌ కళాశాలల నిర్లక్ష్యం, ప్రభుత్వాల పర్యవేక్షణ లోపం.. ఈ ఘటనతో బహిర్గతమయ్యాయని విమర్శించారు. రాహుల్‌ మరణానికి బాధ్యులెవరో తేల్చాలని డిమాండ్‌ చేశారు. 24 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని, అవసరమైతే ఆమరణ దీక్షకు వెనుకాడబోమని హెచ్చరించారు. తెలంగాణలో వెంటనే విద్యార్థి రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తమ కుమారుడు మరణానికి కారణమేంటో తెలియని పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు రాజేశ్వర్‌, అనిత వాపోయారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టి.. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

Updated Date - Jun 26 , 2026 | 05:13 AM