Share News

Anita Singhvi: చౌమహల్లాలో గజల్‌ గానామృతం

ABN , Publish Date - Jan 18 , 2026 | 04:46 AM

కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ మనుసింఘ్వీ భార్య అనితాసింఘ్వీ గజల్‌ గానామృతంతో హైదరాబాద్‌ వాసులు అద్వితీయానుభూతులను పొందారు.

Anita Singhvi: చౌమహల్లాలో గజల్‌ గానామృతం

  • అభిషేక్‌ మనుసింఘ్వీ భార్య అనితా సింఘ్వీ గజల్స్‌

హైదరాబాద్‌ సిటీ, జనవరి 17(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ మనుసింఘ్వీ భార్య అనితాసింఘ్వీ గజల్‌ గానామృతంతో హైదరాబాద్‌ వాసులు అద్వితీయానుభూతులను పొందారు. తెలంగాణా ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి చౌమహల్లా ప్యాలె స్‌లో జరిగిన కార్యక్రమంలో గజల్‌, సూఫీ సంగీత ఝురులలోని తీయదనాన్ని రుచి చూపారు. షకీల్‌ రచించిన గజల్‌ ‘మేరే హమ్‌ నఫస్‌ మేరే దోస్త్‌’ అంటూ ప్రారంభించిన ఈ కార్యక్రమం దాదాపు గంటన్నర పాటు సాగింది. అనితాసింఘ్వీ తన ఆల్బమ్‌ నక్ష-ఏ-టూర్‌ ఆల్బమ్‌లోని గజల్స్‌తో పాటు గాలిబ్‌ ఇక్బాల్‌ రచించిన గజల్స్‌నూ ఆలపించారు. కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్‌, పొన్నం, ఎంపీలు అభిషేక్‌ మనుసింఘ్వీ, రేణుకా చౌదరి, నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, సంగీత నాటక అకాడమీ ఛైర్‌ పర్సన్‌ డాక్టర్‌ అలేఖ్య పుంజల సహా పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 04:46 AM