kumaram bheem asifabad-ఇంటికే అంగన్‌వాడీ సరుకులు
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:07 PM
ఎండలు మండిపోతుండటంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. వేసవి కారణంగా భవనాలు లేని కేంద్రాల్లో ఉక్కపోత ఎక్కువైంది. ఫలితంగా కేంద్రాలకు వచ్చే చిన్నారుల హాజరు శాతం తగ్గింది. గర్భిణులు, బాలింతలు ఒకరిద్దరు తప్ప ఎవరు రావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచు కున్న ప్రభుత్వం లబ్దిదారులకు అంగన్‌వాడీ సరుకులు ఇంటికే ఇవ్వాలని నిర్ణయించింది.
- మే1 నుంచి 31వ తేదీ వరకు
ఆసిఫాబాద్‌రూరల్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యో తి): ఎండలు మండిపోతుండటంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. వేసవి కారణంగా భవనాలు లేని కేంద్రాల్లో ఉక్కపోత ఎక్కువైంది. ఫలితంగా కేంద్రాలకు వచ్చే చిన్నారుల హాజరు శాతం తగ్గింది. గర్భిణులు, బాలింతలు ఒకరిద్దరు తప్ప ఎవరు రావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచు కున్న ప్రభుత్వం లబ్దిదారులకు అంగన్‌వాడీ సరుకులు ఇంటికే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు వచ్చాయి. మే 1 నుంచి 31వ తేదీ వరకు ఆదేశాలు అమలు చేయనున్నారు.
- ఐదు ప్రాజెక్టుల పరిధిలో..
జిల్లాలో ఐదు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 973 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందు లో 46,356 మంది చిన్నారులు, 5248 మంది గర్భిణులు, 2429 మంది బాలింతలు ఉన్నారు. వీరికి ప్రతిరోజు ఉడకబెట్టిన కోడిగుడ్లు, బాలా మృతం, పాలు, మురుకులు అన్నం, పప్పుతో కూడిన పోషకాహరం అంది స్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మే 1 నుంచి అంగ న్‌వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వగా పోషకాహర లోపం ఉండకూడదనే ఉద్దేశంతో ఇంటికే సరుకులు అందించను న్నారు. 3-5 ఏళ్ల పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు 30 గుడ్లు (ఉడకబె ట్టనివి), 7-3 ఏళ్ల వారికి 16 గుడ్డుల, 6లీ పాలు, మంచినూనె(రోజుకు 16గ్రా), 25 రోజులకు సరిపడా బియ్యం, కందిపప్పు మురుకులు అందజేయనున్నారు.
ఆదేశాలు వచ్చాయి..
- అడెపు భాస్కర్, జిల్లా సంక్షేమాధికారి
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నా రులు, గర్భిణులు, బాలింతలకు సరుకులు ఇంటికే పంపిణీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. జిల్లాలోని 1006 కేంద్రా లలో సరుకులు పంపిణీ కార్యక్రమం చేపడు తాం. మే 1 నుంచి 31 వరకు సరుకులు పంపిణీ చేయనున్నాం.