‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌కు రాష్ట్రస్థాయి కన్సొలేషన్ బహుమతి
ABN , Publish Date - Aug 17 , 2026 | 06:31 AM
ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ మాచర్ల నాగేశ్వరరావుకు రాష్ట్రస్థాయి ఉత్తమ వార్త ఫొటోగ్రఫీ పోటీలో కన్సొలేషన్ బహుమతి లభించింది. దశాబ్ద కాలంగా ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్న ఈయన..
జీడిమెట్ల, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ మాచర్ల నాగేశ్వరరావుకు రాష్ట్రస్థాయి ఉత్తమ వార్త ఫొటోగ్రఫీ పోటీలో కన్సొలేషన్ బహుమతి లభించింది. దశాబ్ద కాలంగా ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్న ఈయన కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి జోన్‌లలో, అదేవిధంగా హైదరాబాద్ ఫొటోగ్రాఫర్‌గా తన సేవలు అందిస్తున్నారు. 187వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం రాష్ట్రస్థాయి ఉత్తమ వార్త ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించింది. 33 జిల్లాల నుంచి దాదాపు 102 ఎంట్రీలకు 306 ఛాయాచిత్రాలు వచ్చాయి. వీటిలో జ్యూరీ సభ్యులు నాగేశ్వరరావు పంపించిన ‘రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేసుకుంటూనే తన బిడ్డలను ఊయలలో ఊగిస్తున్న తల్లి’ ఫొటోను కన్సొలేషన్ బహుమతికి ఎంపిక చేశారు. ఈ నెల 19న నగరంలో ఆయనకు బహుమతి ప్రదానం చేయనున్నారు.