Share News

kumaram bheem asifabad- ఇక పక్కగా.. ఇళ్ల లెక్క..

ABN , Publish Date - May 15 , 2026 | 10:07 PM

కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చేపట్టనున్న జనగణన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈనెల 11వ తేదీ నుంచి జూన్‌ 9వ తేదీ వరకు చేపట్టనున్న ఇళ్లగణ న ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి మూడు రోజుల పాటు సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన బ్లాకుల్లో ఇళ్లను గుర్తించి మ్యాపింగ్‌ చేసుకుంటున్నారు.

kumaram bheem asifabad- ఇక పక్కగా.. ఇళ్ల లెక్క..
లోగో

- కొనసాగుతున్న ఇళ్లగణన

- జిల్లాలో 335 పంచాయతీలు, రెండు మున్సిపాలిటీలు

- క్షేత్రస్థాయిలో తిరుగుతూ వివరాలు సేకరిస్తున్న సిబ్బంది

ఆసిఫాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చేపట్టనున్న జనగణన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈనెల 11వ తేదీ నుంచి జూన్‌ 9వ తేదీ వరకు చేపట్టనున్న ఇళ్లగణ న ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి మూడు రోజుల పాటు సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన బ్లాకుల్లో ఇళ్లను గుర్తించి మ్యాపింగ్‌ చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఆ ప్రక్రియ కొనసాగుతోంది. నేటి నుంచి 34 ఆంశాల్లో ఇళ్లగణనలో అందులో నివసిస్తున్న యాజమాని ద్వారా వివరాలు నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియ అంతా డిజిటల్‌లోనే కొనసాగునుంది. దీని కంటే ముందు గతనెల 26 నుంచి ఈనెల 10 వరకు ఆయా ఇళ్ల యాజమానులు తమ వివరా లను నమోదు చేసుకునేందుకు స్వీయగణన కోసం ఒక యాప్‌ను రూపొందించారు. ఆ యాప్‌ ద్వారా స్వీయగణన చేపట్టాలని జిల్లా అధికార యంత్రాం గం ప్రచారం చేసినప్పటికీ ఇదే మొదటిసారి కావడంతో అంతగా స్పందన లభించలేదు. జిల్లా వ్యాప్తంగా స్వీయగణన 8,425 మంది మాత్రమే తమ వివరాలను యాప్‌లో నమోదు చేసినట్లు అధికారుల గణాంకాలను పట్టి తెలుస్తోంది.

- జిల్లాలో 1689 బ్లాకులు..

జిల్లాలో 15 మండలాల పరిధిలో 335 పంచాయతీలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. 2011 గణాంకాల ప్రకారం జిల్లాలో 5.93 లక్షల జనాభా, 1.20 లక్షల గృహలు ఉన్నా యి. ప్రస్తుతం కొనసాగుతున్న జనగణనలో ఇళ్ల సంఖ్య పక్కాగా తేలనుంది. జిల్లాలోని తహసీల్దార్ల, ఎంపీడీవోలను చార్జ్‌ అధికారులుగా నియమించారు. 1,689 హౌస్‌ లిస్టింగ్‌ బ్లాకులను ఏర్పాటు చేశారు. ఇందులో 174 మంది సూపర్‌వైజర్లు, 994 మంది ఎన్యూ మరే టర్లను నియమించారు. 700 నుంచి 800 మంది జనాభాను ఒక బ్లాకుగా గుర్తించి ఎన్యూమరేటర్‌కు లెక్కించే బాధ్యత అప్పగించారు. పదేళ్లకు ఒకసారి జరిగే జనగణనలో మొదట హౌస్‌మ్యాపింగ్‌ ద్వారా గుర్తించిన ఇళ్లను లెక్కిస్తారు. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు సర్వే సిబ్బంది మ్యాపింగ్‌ ప్రక్రియను పూర్తి చేశారు. ఆ తర్వాత జూన్‌ 9 వరకు ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టనున్నారు. ఈ దశలో ఎన్యూమరేటర్లు ట్యాబ్‌ ల్లో ఇళ్ల వివరాలను, చిరునామాలను డిజిటలైజ్‌ చేయనున్నారు.

- 34 అంశాల్లో..

జనాభా లెక్కల్లో భాగంగా మొదట చేపట్టనున్న ఇళ్ల గణనలో 34 ఆంశాల్లో వివరాలు నమోదు చేయనున్నారు. ఎన్యూమరేటర్లు ప్రతీ ఇంటిని సందర్శిస్తారు. ముందుగా ఇంటి స్వరూపం గురించి వివ రాలు నమోదు చేసుకుంటారు. గుడిసె, పెంకులు, స్లాబ్‌ గదుల సంఖ్య, జీప్లస్‌1 అంతకు పైగా ఉన్నటు వంటి వివరాలను నమోదు చేసుకుంటారు. ఇంటి నంబరు జనగణన జాబితాలో కేటాయించిన నంబరు ఇంటిలో ఫ్లోర్‌కు వాడిన మెటిరి యల్‌ ఇంటి గోడల నిర్మాణంలో ప్రధానంగా వాడిన మెటిరియల్‌ ఇంటి పైకప్పులో వాడిన మెటిరియల్‌ ఇంటిని ఎలా వాడుతున్నారు(రెసిడెన్సియల్‌, పారి శ్రామికంగా, వాణిజ్య పరంగా, ఖాళీగా ఉందా) ఇళ్లు అవాసయోగ్యంగా ఉందా? శిధిలావస్థలో ఉందా? కుటుంబ సభ్యుల సంఖ్య ఎం త ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న వారి సంఖ్య ఎంత తదితర వివరాలు నమోదు చేస్తారు. సామాజిక వర్గాల వారీగా వివరాలు నమోదు చేసుకుంటారు. ఇళ్లు సొంతమా అద్దె ఇళ్లు, ఇం ట్లో ఎన్ని గదులు వాడుకుంటున్నారో నమోదు చేసుకుంటారు. ఇంట్లో పెళ్లి అయిన జంట లు ఎన్ని ఉన్నాయి. తాగునీటి కోసం ప్రధానంగా దేనిపై ఆఽధారపడుతున్నారు. ఇంట్లో విద్యుత్‌ అవసరాలకు ఏ వనరులను వినియోగిస్తున్నారో నమోదు చేస్తారు. వీటితో పాటు మరుగు దొడ్లు, డ్రైనేజీ వివరాలు ఎల్‌పీజీ, టీవీ, ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌, స్మార్ట్‌ఫోన్‌, లాప్‌టాప్‌, ద్విచక్రవా హనాలు, కారు, జీపు, వ్యాను ఎన్ని ఉన్నాయో నమోదు చేసుకుం టారు. ఇంట్లో ప్రధానంగా తినే ధాన్యాలు, ఫోన్‌ నం బరు తదితర వివరాలను నమోదు చేసుకుంటారు.

Updated Date - May 15 , 2026 | 10:07 PM