మూడేళ్లలో నింగిలోకి ‘అనంత్‌శాట్-1’
ABN , Publish Date - Jun 21 , 2026 | 04:51 AM
భారత అంతరిక్ష రంగం మరో కీలక మైలురాయికి చేరువైంది. హైదరాబాద్‌కు చెందిన అనంత్ టెక్నాలజీస్ సంస్థ దేశంలోనే తొలి ప్రైవేటు సమాచార...
భారత తొలి ప్రైవేటు కమ్యూనికేషన్ ఉపగ్రహం!
2029లో ప్రయోగించేందుకు సిద్ధం చేస్తున్న హైదరాబాదీ సంస్థ అనంత్ టెక్నాలజీస్
హైదరాబాద్, జూన్ 20: భారత అంతరిక్ష రంగం మరో కీలక మైలురాయికి చేరువైంది. హైదరాబాద్‌కు చెందిన అనంత్ టెక్నాలజీస్ సంస్థ దేశంలోనే తొలి ప్రైవేటు సమాచార (కమ్యూనికేషన్) ఉపగ్రహం ‘అనంత్‌శాట్-1’ను నింగిలోకి పంపనుంది. 2029లో ఈ ఉపగ్రహాన్ని పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సంస్థ చైర్మన్ పావులూరి సుబ్బారావు తాజాగా వెల్లడించారు. సెకనుకు 100 గిగాబైట్ల సామర్థ్యంతో అభివృద్ధి చేస్తున్న ఈ ఉపగ్రహంతో.. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్, టెలీ ఎడ్యుకేషన్, టెలీ మెడిసిన్ సేవలు అందించేందుకు వీలవుతుందని తెలిపారు. నిజానికి మన దేశంలో ఇప్పటివరకు ఇస్రో మాత్రమే సమాచార ఉపగ్రహాలను ప్రయోగించింది. వాటికి సంబంధించి అనంత్ టెక్నాలజీస్ సంస్థ పలు పరికరాలను తయారు చేసి అందించింది. ఇటీవల కేంద్రం ప్రైవేటు అంతరిక్ష సంస్థలకు తలుపులు తెరిచిన నేపథ్యంలో.. కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు అనంత్ టెక్నాలజీస్ సిద్ధమైంది.