అనకాపల్లి వీక్లీ స్పెషల్ ఇకపై రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్
ABN , Publish Date - May 05 , 2026 | 03:51 AM
చర్లపల్లి- అనకాపల్లి మధ్య ప్రస్తుతం నడుస్తున్న వీక్లీ స్పెషల్ రైలును ఇక నుంచి రెగ్యులర్ వీక్లీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ సిటీ, మే 4 (ఆంధ్రజ్యోతి): చర్లపల్లి- అనకాపల్లి మధ్య ప్రస్తుతం నడుస్తున్న వీక్లీ స్పెషల్ రైలును ఇక నుంచి రెగ్యులర్ వీక్లీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. 17054 వీక్లీ ఏసీ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 8నుంచి ప్రతీ శుక్రవారం అనకాపల్లి నుంచి సాయంత్రం 5.35గంటలకు బయల్దేరుతుంది. అలాగే, ఈ నెల 14నుంచి 17053 ఎక్స్‌ప్రెస్ ప్రతీ గురువారం రాత్రి 10.10గంటలకు చర్లపల్లి నుంచి అనకాపల్లికి బయల్దేరనుందని సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు.