Share News

అసాంఘీక శక్తులపై ఉక్కుపాదం

ABN , Publish Date - Nov 28 , 2026 | 10:57 PM

రామ గుండం పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని అసాంఘీక శ క్తులు, కార్యకలాపాలపై పోలీసు శాఖ ఉక్కుపాదం మో పుతోంది. అల్లరి మూకలు, రౌడీ షీటర్లను ఎక్కడి కక్కడే కట్టడి చేసే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిం చి అమలు చేస్తున్నారు. ఈ మద్య చోటు చేసు కుంటున్న వరుస అలజడులతో అప్రమత్తమైన పోలీసు శాఖ వాటి ని అణచివేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోం ది.

అసాంఘీక శక్తులపై ఉక్కుపాదం

- అల్లరిమూకలపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి

- నగర బహిష్కరణలతో అల్లర్లకు చెక్‌

- బైండోవర్లు, కార్డెన్‌ సెర్చ్‌లతో కట్టడికి యత్నం

- జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలతో అప్రమత్తం

మంచిర్యాల, నవంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి): రామ గుండం పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని అసాంఘీక శ క్తులు, కార్యకలాపాలపై పోలీసు శాఖ ఉక్కుపాదం మో పుతోంది. అల్లరి మూకలు, రౌడీ షీటర్లను ఎక్కడి కక్కడే కట్టడి చేసే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిం చి అమలు చేస్తున్నారు. ఈ మద్య చోటు చేసు కుంటున్న వరుస అలజడులతో అప్రమత్తమైన పోలీసు శాఖ వాటి ని అణచివేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోం ది. రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా ఆదేశాల మే రకు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్‌, ఏసీపీ ప్రకాష్‌ ప్రత్యేక డ్రైవ్‌లతో అసాంఘీక శక్తుల కట్టడి కి పూను కుంటున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఈ మద్య కాలంలో చోటు చేసుకున్న వరుస ఘటనలు పోలీసు శాఖకు అప్రతిష్ట కలిగించేలా ఉండడంతో ఉన్నతా ధికా రుల ఆదేశాల మేరకు పోలీసులు కట్టుదిట్టమైన బందో బస్తు ఏర్పాటు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్‌ పా ర్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల కారణంగా రెండు వర్గాలు తీవ్ర అలజడిని సృష్టించిన విషయం తెలిసిందే. ఒక వర్గంపై మరో వర్గం ప్రత్యక్ష దాడులకు పూనుకుం టుండడంతో సామాన్య ప్రజలలోనూ తీవ్ర భయాందో ళనలు వ్యక్తమయ్యాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో నన్న ఉత్కంఠలో ఆ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నా యకులు సైతం ఆందోళన చెందుతున్నారు. దీనిని సవాలుగా తీసుకున్న పోలీసు శాఖ అల్లరి మూకల కట్టడే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు చేపడుతోంది.

నగర బహిష్కరణ వేటు....

కాంగ్రెస్‌ పార్టీలో ఏర్పడ్డ రెండు వర్గాలకు చెందిన అల్లరిమూకలను కట్టడి చేసే దిశగా పోలీసు శాఖ ప్ర త్యేకంగా కార్యాచరణ చేపడుతోంది. ఇందులో భాగంగా అలజడులకు కారణమైన రెండు వర్గాలకు చెందిన 16 మందిపై ఇప్పటికే నగర బహిష్కరణ వేటు వేశారు. ఆరు నెలల పాటు ఈ ప్రాంతానికి దూరంగా ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అల్లరి మూకల నివా సాలకు వెళ్లి వారిని తక్షణమే ఖాళీ చేయించాల్సిందిగా ఇంటి యజమానులకు పోలీసులు సూచిస్తున్నారు. కొం దరు నగర బహిష్కరణకు గురైనప్పటికీ తిరిగి రహ స్యంగా జిల్లా కేంద్రంలో అడుగు పెట్టడంతో సమాచా రం అందుకున్న పోలీసులు నివాస గృహాల తనిఖీల చ ర్యలకు పూనుకుంటున్నారు. ఈ క్రమంలో పాత మం చిర్యాలకు చెందిన ఓ ఇంటి యజమానిని మూడు రో జుల క్రితం ఏసీపీ ప్రకాష్‌ హెచ్చరించడం దీనికి నిదర్శ నం. నగర బహిష్కరణకు గురైన ఓ వ్యక్తి పాత మం చిర్యాలలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటుండటాన్ని గమ నించిన పోలీసులు అర్దరాత్రి ఆ ఇంటికి వెళ్లి వెంటనే ఖాళీ చేయించాల్సిందిగా యజమానికి సూచించారు. అ లా నగర బహిష్కరణకు గురైన వారి పట్ల పోలీసులు ప్రత్యేక ధృష్టిని సారిస్తున్నారు.

బైండోవర్లు, కార్డెన్‌ సెర్చ్‌లతో...

జిల్లా కేంద్రలో 16 మందిపై నగర బహిష్కరణ వే టు వేయగా మిగతా అల్లరి మూకలపైన పోలీసులు ప్ర త్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో వారి నివాసా లకు వెళ్లి తనిఖీలు చేయడం, హెచ్చరించడం లాంటి ప నులు చేపడుతున్నారు. అలాగే అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిపైనా ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ నేతృత్వంలో పట్టణ సీఐ ప్రమోద్‌రావు, ఇతర సిబ్బందితో శుక్రవారం అర్దరాత్రి అ నుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడం లక్ష్యం గా తనిఖీలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా, బైపాస్‌ రోడ్డు, తెలంగాణ తల్లి విగ్రహం జం క్షన్‌, బస్టాండ్‌ ప్రాంతంతో పాటు ప్రధాన కూడళ్లలో పో లీసులు ఏకకాలంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. అర్దరాత్రి రో డ్లపైకి వచ్చిన వాహనదారుల వివరాలు, డ్రైవింగ్‌ లైసె న్సులు, రిజిస్ర్టేషన్‌, తదితర దృవపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే నగరంలోని ఎన్టిఆర్‌ నగర్‌, సా యికుంట, తిలక్‌ నగర్‌, రాజీవ్‌ నగర్‌, అండాలమ్మ కాలనీ లాంటి అలజడి ఎక్కువగా ఉండే ప్రాంతాల లో విరివిగా కార్డెన్‌ సెర్చ్‌లు నిర్వహిస్తున్నారు. అను మానాస్పద వ్యక్తులు తారసపడ్డ పక్షంలో బైండోవర్‌ల కు వెనుకాడడం లేదు. ఇలా ప్రత్యేక కార్యాచరణతో అల్లరిమూకల ఆటలు కట్టించడంలో పోలీసు శాఖ ని మగ్నమైంది. పోలీసుల ప్రత్యేక కార్యాచరణ కారణం గా నగరంలో అల్లరి మూకల అలజడి కొంతమేర తగ్గగా, పూర్తిగా రూపు మాపేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.

అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు....డీసీపీ ఎగ్గడి భాస్కర్‌

జిల్లాలో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే ఎవరి ని కూడా ఉపేక్షించే పరిస్ధితి లేదు. దొంగతనాలు, గం జాయి సేవనం, ప్రత్యేక్ష దాడులకు పాల్పడే వారిపై చ ట్టపర చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో యువత అనవసరంగా రోడ్లపైకి రాకూడ దు. సరియైున కారణం లేకుండా అర్దరాత్రులు రోడ్లపై సంచరించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. జిల్లా వ్యాప్తంగా ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి. మ ద్యం సేవించి వాహనాలు నడిపే వారిని ఎట్టి పరిస్ధితు లలో ఉపేక్షించేది లేదు.

Updated Date - Nov 28 , 2026 | 10:57 PM