Share News

ఉన్నతాధికారులతో విచారణ చేయించాలి

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:26 PM

మూ డు రోజుల క్రితం పెంట్లవెల్లి గ్రామంలో హత్య కుగురైన ఆర్‌ఎంపీ, న్యాయవాది మల్లయ్య హ త్య కేసును డీఎస్పీ, లేదా ఎస్పీ చేత విచారణ జరిపించాలని తెలంగాణ బార్‌ అసోసియేషన్‌ కౌన్సిల్‌ మెంబర్‌ హనమంతురెడ్డి కోరారు.

ఉన్నతాధికారులతో విచారణ చేయించాలి
విలేకరులతో మాట్లాడుతున్న తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ హనుమంతురెడ్డి

- తెలంగాణ బార్‌ అసోసియేషన్‌ కౌన్సిల్‌ మెంబర్‌ హనుమంతురెడ్డి

పెంట్లవెల్లి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : మూ డు రోజుల క్రితం పెంట్లవెల్లి గ్రామంలో హత్య కుగురైన ఆర్‌ఎంపీ, న్యాయవాది మల్లయ్య హ త్య కేసును డీఎస్పీ, లేదా ఎస్పీ చేత విచారణ జరిపించాలని తెలంగాణ బార్‌ అసోసియేషన్‌ కౌన్సిల్‌ మెంబర్‌ హనమంతురెడ్డి కోరారు. సో మవారం కొల్లాపూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్య క్షుడు భూజల భాస్కర్‌రెడ్డి, ఇతర న్యాయవాదు లతో కలిసి మల్లయ్య భౌతిక దేహంపై పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్‌ఎంపీ వైద్యుడు మల్లయ్యను దారుణంగా హత్య చేయ డం సభ్య సమాజం తలదించుకునే సంఘటన అని అన్నారు. తమకు తెలిసిన సమాచారం మే రకు, ఐదారేళ్ల నుంచి భూమికి సంబంధించిన వివాదాలు ఇద్దరి మధ్యన ఉన్నాయని, మల్ల య్యకు కోర్డులో జడ్జిమెంట్‌ అనుకూలంగా ఉన్న ట్లు ఆయన తెలిపారు. మల్లయ్య పదేళ్ల నుంచి కూడా పోలీస్‌ స్టేషన్లను అప్రూచ్‌ అవుతున్నా రని, ఆయనకు ప్రాణహాని ఉందని స్థానిక పో లీస్‌ స్టేషన్‌తో పాటుఅలాగే జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశారని తెలిపారు. పోలీసులు అలస త్వం వల్లనే వారు బరితెగించడం మూలంగానే మూడు రోజుల క్రితం ఆయనను దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంట నే స్పందించి ఒక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేసి ఈ కేసును పరిష్కరించాలన్నారు. పెంట్ల వెల్లి పోలీసులపై తెలంగాణ డీజీపీ స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశా రు. కొల్లాపూర్‌ బార్‌ అసోసియేషన్‌ న్యాయవా దులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2026 | 11:26 PM