Share News

తీరని ధన దాహం...!

ABN , Publish Date - Nov 25 , 2026 | 11:37 PM

మంచిర్యాల జి ల్లాలో వివిధ పనులు చేపట్టేందుకు అవసరమయ్యే ఇసుక, మ ట్టి రవాణా చేసే కాంట్రాక్టర్లకు ధన దాహం తీరడం లేదు. రా త్రి, పగలు తేడా లేకుండా వాగులు, నదులు, గుట్టలను గుళ్ల చేస్తున్నారు.

తీరని ధన దాహం...!

-జోరుగా ఇసుక అక్రమ రవాణా

-ప్రభుత్వ రీచ్‌లున్నా తగ్గని ప్రైవేటు జోరు

-మట్టి తవ్వకాలతో కరిగిపోతున్న గుట్టలు

-అభివృద్ధి పేరుతో పర్యావరణానికి విఘాతం

మంచిర్యాల, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జి ల్లాలో వివిధ పనులు చేపట్టేందుకు అవసరమయ్యే ఇసుక, మ ట్టి రవాణా చేసే కాంట్రాక్టర్లకు ధన దాహం తీరడం లేదు. రా త్రి, పగలు తేడా లేకుండా వాగులు, నదులు, గుట్టలను గుళ్ల చేస్తున్నారు. అరకొర అనుమతులతో పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నా అడిగేవారు లేకపోవడంతో జిల్లాలో కాంట్రాక్టర్లు అడిందే ఆటగా పరిస్థితి తయారైంది.

జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రాత్రి పడిందంటే చాలు వందలాది ట్రాక్టర్లతో అక్రమంగా తరలిం చుకుపోతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ ధనార్జనే ధ్యేయంగా గోదావరి నదిని గుల్ల చేస్తున్నారు. అక్రమ క్వారీలు ఏర్పాటు చేస్తూ నీళ్లలోనూ తవ్వకాలు చేపడుతున్నారు. గోదా వరిలో ఓ వైపు ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన రీచ్‌లు ఉం డగానే, పెద్ద మొత్తంలో అక్రమ మార్గంలో ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అది కూడా ఎలాంటి సీనరేజ్‌ చార్జీ లు చెల్లించకుండానే అక్రమార్కులు యథేశర్ఛగా ఇసుక అక్ర మ రవాణాకు పాల్పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని పుష్కర ఘాట్‌, పాత మంచిర్యాల, వేంపల్లి, గుడిపేట వద్ద గోదావరి నుంచి నిత్యం పెద్ద మొత్తంలో ఇసుక ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా అవుతోంది. మరోవైపు ప్రభుత్వపరంగా చేపట్టే పలు అ భివృద్ధి పనులకూ రాళ్లవాగు ఇసుకను వినియోగించడంపట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

తరలిపోతున్న మట్టి, మొరం...

జిల్లాలో అనధికారికంగా పెద్ద మొత్తంలో అక్రమ మార్గంలో మట్టి, మొరం తరలిపోతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఏకంగా లారీల ద్వారా తరలిస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము చే సుకుంటున్నారు. హాజీపూర్‌ మండలం పడ్తనపల్లి గ్రామ శివారులోని గోదావరి ఒడ్డున ఎక్సకవేటర్ల సహాయంతో లారీల్లో ఎలాంటి పర్మిట్లు లేకుండా మట్టిని తరలిస్తున్న ఐదు లారీలను గతంలో గనులు, భూగర్భశాఖ అధికారులు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అధికారుల తనిఖీల్లో పట్టుబడుతున్నవి స్వల్ప సంఖ్యలో ఉండగా, గుట్టుగా తరలిస్తున్న లారీలు వందల సం ఖ్యలో ఉంటున్నాయి. అలాగే మొరం కూడా పెద్ద మొత్తంలో తరలిపోతోంది. పాత మంచిర్యాల సమీపంలోని కుమ్మరికుంట, పెద్దకుంట చెరువు వెనకాల ఉన్న ప్రభుత్వ, పట్టా భూముల్లో నుంచి ఎక్సకావేటర్‌ సహాయంతో మొరాన్ని తవ్వుతున్న అక్ర మార్కులు నిత్యం వందల ట్రాక్టర్లతో తరలిస్తున్నారు.

గుట్టలనూ వదలని మాఫియా...

ధనార్జనే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్ట ర్లు పలువురు మట్టి, మొరం కోసం గుట్టలనూ కొల్లగొడుతు న్నారు. మందమర్రి మండలంలోని బొక్కల గుట్ట, జిల్లా కేం ద్రంలోని అండాళమ్మ కాలనీ సమీపంలోని జాలా గుట్ట, గూ డెం గుట్టలో కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారీతిన మట్టి, మొరం తవ్వుతున్నారు. గృహ ని ర్మాణాలకు బండరాయి, మొరం అవసరం అవుతుండటంతో మైనింగ్‌ మాఫియా కళ్లు గుట్టలపై పడుతున్నాయి. అక్రమంగా మట్టి, మొరం, బండరాయి తవ్వకాలు చేపడుతున్న కాంట్రా క్టర్లకు కొందరు రాజకీయ నాయకుల అండదండలు ఉండటం తో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇ సుక, మొరం, మట్టి మాఫియా కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో గండి పడుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భూము ల్లో మొరం, మట్టి తవ్వకాలు చేపట్టాలంటే వాల్టా చట్టం ప్రకా రం ప్రభుత్వానికి రాయాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారులు అక్రమంగా తరలించే ఇసుక, మట్టి, మొరం ఒక్కో ట్రిప్పును రకరకాల రేట్లకు విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నా రు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న మొరం, మట్టి తవ్వకాలకు ఒక్కో ట్రాక్టర్‌కు రూ. 2000 వరకు వసూలు చే స్తుండగా వినియోగదారులకు చేస్తున్నారు. అలాగే ఇసుకను ఒక్కో ట్రాక్టర్‌కు రూ. 3000 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసు కుంటున్నారు. వాటిపై ప్రభుత్వానికి ఎలాంటి రాయాల్టి చెల్లిం చడం లేదు. నిత్యం లక్షల్లో అక్రమ వ్యాపారం జరుగుతుండగా రాయాల్టి రూపేణ (5వ పేజీ తరువాయి)

ప్రభుత్వానికి ఒక్క రూపాయి చెల్లించకపో వడం గమనార్హం. మట్టి, ఇసుక మాఫియా కారణంగా పెద్ద మొత్తంలో ఖనిజ సంపద తరలిపోతుండగా, పర్యావ రణానికీ విఘాతం కలుగుతోంది. అప్పు డప్పుడు మై నింగ్‌ అధికారులు దాడులు చేస్తూ దొరికిన ట్రాక్టర్లు, టిప్పర్లను సీజ్‌ చేస్తున్నప్పటికీ బరి తెగించిన మాఫి యా వాటికి బెదరడం లేదు. మైనింగ్‌, రెవెన్యూ అధి కారులు పకడ్బంధీ నిఘా పెట్టి దాడులు జరిపితే తప్ప ఇసుక, మట్టి అక్రమ రవాణాకు బ్రేకులు పడే అవకాశం లేదు.

కాలగర్భంలోకి శిలువ గుట్ట....

లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధి మోదెల శివారు లోని సిలువ గుట్ట త్వరలో కాలగర్భంలో కలిసి పో నుంది. వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో గు ట్టను పూర్తిగా చదును చేసి, వ్యవసాయ మార్కె టిం గ్‌ శాఖ గోదాముల నిర్మాణం చేపట్టనున్నారు. అం దులో జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించే వరి ధాన్యాన్ని నిలువ చేయనున్నా రు. ఈ మేరకు రెవెన్యూ, మైనింగ్‌ శాఖల నుంచి గో దాముల నిర్మాణం, గుట్టలోని మట్టి తవ్వకాలకు అ నుమతులు కూడా జారీ అయ్యాయి. అయితే తవ్వ కాల్లో భాగంగా బయటపడే బండరాళ్ల తరలింపు న కు అనుమతులు లేకపోయినా, కాంట్రాక్టరు యథే శ్చగా తరలించుకుపోతుండటం గమనార్హం. పైగా గుట్టలో వెలికితీసిన మట్టి, మొరానికి రాయల్టీ చె ల్లించాల్సి ఉండగా, అది అమలు కావడం లేదని స మాచారం. సిలువ గుట్ట సుమారు ఐదు ఎకరాల్లో వి స్తరించి ఉండగా, తవ్వకాల కారణంగా కరిగిపోతోం ది. పర్యావరణానికి ప్రతీకగా నిలిచే సిలువ గుట్టలో తవ్వకాలు నిలిపివేయాలని కోరుతూ సీపీఐఎంల్‌ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం మైనింగ్‌శాఖ మంత్రి వివేకానందకు వి న్నవిం చారు. పైగా పర్యావరణ కాలుష్య మండలి అ నుమ తులు లేకుండానే అధికారులు తవ్వకాలను అనుమ తులు ఇచ్చారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Updated Date - Nov 25 , 2026 | 11:37 PM