Share News

ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలి

ABN , Publish Date - Aug 10 , 2026 | 10:56 PM

కేంద్రంలోని బీ జేపీ ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడు తుందని, వాటికి స్వస్తి పలకాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కా ర్యదర్శి మేకల దాసు అన్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలి
మంచిర్యాలలో రాస్తారోకో చేస్తున్న నాయకులు

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలోని బీ జేపీ ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడు తుందని, వాటికి స్వస్తి పలకాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కా ర్యదర్శి మేకల దాసు అన్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమ స్పూర్తితో దే శాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించడాన్ని, కార్మికుల, ప్రజల హక్కు లను కాలరాయడాన్ని నిరసిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని ఓవ ర్‌ బ్రిడ్జి వద్ద ప్రజా సంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకు వచ్చి కార్మికుల హక్కులను హరించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కా ర్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పిం చాల్సిన ప్రభుత్వం కార్పోరేట్‌ శక్తులకు అనుకూలంగా విధానాలను రూపొందించడం దుర్మార్గమన్నారు. రైతులకుగిట్టుబాటు ధర, ఉత్ప త్తులకు సరైన మార్కెట్‌ లేక ఇబ్బందులు పడుతున్నారని, అయినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. దేశానికి సంపద సృష్టిస్తున్న కా ర్మికులను, అన్నం పెడుతున్న రైతులను పట్టించుకోని పాలకుల వి ధానాలను ఎండగట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అక్బర లీ, కలీందర్‌ఆలీఖాన్‌, పౌలు, కొమురయ్య, శ్రీనివాస్‌, రామన్న, పోచ న్న, రంజిత్‌కుమార్‌, ప్రకాష్‌,రఫియా,పద్మావతి, లాల్‌కుమార్‌, సురేం దర్‌, రమేష్‌, ప్రభాకర్‌, మంగ పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2026 | 10:56 PM