తుమ్మిడిహెట్టి పేరుతో ప్రజల దృష్టి మరల్చే చర్య
ABN , Publish Date - Oct 27 , 2026 | 10:32 PM
రాష్ట్రంలో నెల కొన్న తాగు నీటి ఎద్దడి, కరెంటు కోతలపై ప్రజల దృష్టిని మళ్లీంచేందుకే కాంగ్రె స్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి పేరుతో నాటకా లాడుతుందని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీ ఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరో పించారు.
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
మంచిర్యాల, అక్టోబర్ 27(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో నెల కొన్న తాగు నీటి ఎద్దడి, కరెంటు కోతలపై ప్రజల దృష్టిని మళ్లీంచేందుకే కాంగ్రె స్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి పేరుతో నాటకా లాడుతుందని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీ ఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరో పించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తె లంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ చేత కాని అసమర్థ పాలనతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రా నికి కరువును తీసుకువచ్చిందన్నారు. మహారా ష్ట్ర ప్రభుత్వంలో ఈ పరిస్ధితిని ప్రజల నుంచి మళ్లీంచేందుకు చర్చల పేరిట సీఎం రేవంత్ రె డ్డి నాటకాలకు తెరలేపారని విమర్శించారు. రాష్ట్రంలో రైతాంగం కరెంటు, నీరు లేక అల్లా డుతుంటే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు మహారాష్ట్ర వెళ్లిఏదో ఘనకార్యం చేసినట్లు పో జులిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉన్న నీటిని కిందకు వదిలి ఇప్పుడు తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడతాననడం హాస్యాస్పదంగా ఉంద న్నారు. చెన్నూరు నియోకవర్గంలో కరెంటు రాక రైతులు ట్యాంకర్లతో వరి పంటకు నీరు పోసుకునే పరిస్ధితి దాపురించిందన్నారు. ఇది కాలం చేసిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని విమర్శించారు. పాలమూరు - రం గారెడ్డి లిఫ్టులు ఆన్ చేస్తే జిల్లాలకు నీరు వచ్చే దని, కాని ప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డా రు. కరోనా లాంటి విపత్కర సమయంలో కేసీ ఆర్ ప్రజలకు భరోసా ఇస్తే రేవంత్‌రెడ్డి మా త్రం సెల్ఫ్ డిక్లరేషన్ల పేరుతో రైతులను భయ పెడుతున్నారన్నారు. బ్యారేజి కట్టి ఆదిలాబాద్‌కు నీరు ఇస్తామం టున్న ప్రభుత్వం అక్కడ నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పిన విష యాన్ని ఎందుకు మర్చిపోయిందని ప్రశ్నించారు. ఒక వేళ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఎన్ని ఎకరాలకు నీరు వస్తా యి... ?ఎంత ఖర్చు అవుతుంది...?అన్న దానికి సంబంధించిన డీపీఆర్ ను వెంటనే భయట పెట్టాలని డిమాండ్ చేశారు. కన్నెపల్లి నుం చి నీళ్లు ఎత్తిపోయకుండా కిందకు వదిలేశారని ద్వజమెత్తారు. మేడిగడ్డ విషయంలో ఆగమేఘాలమీద ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు తె ప్పించిన బీజేపీ మరమ్మతుల విషయంలో ఎందుకు మాట్లాడ డం లేదని ప్రశ్నించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే నిధులు, నీళ్లు ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో బాల్క సుమన్‌తో పాటు బీఆర్‌ఎస్ నేతలు కిషోర్ గౌడ్, గెల్లు శ్రీనివాస్, విజయ్ కుమార్‌పాల్గొన్నారు.