పెద్దపులుల అడ్డాగా అమ్రాబాద్ అభయారణ్యం
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:54 AM
నాగర్‌కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యం (ఏటీఆర్) పేరుకు తగ్గట్లుగానే పెద్దపులులకు అడ్డాగా నిరూపితమవుతోంది.
జాతీయ అంచనా సర్వే- 2026 ప్రకారం 42 పెద్దపులులు ఉన్నట్లు గుర్తింపు
అచ్చంపేట/మన్ననూర్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యం (ఏటీఆర్) పేరుకు తగ్గట్లుగానే పెద్దపులులకు అడ్డాగా నిరూపితమవుతోంది. అఖిల భారత పులుల సంఖ్య అంచనా- 2026 సర్వే ప్రకారం అమ్రాబాద్ అడవుల్లో మొత్తం 42 పెద్దపులులు నివాసం ఉంటున్నట్లు తేలిందని డీఎ్‌ఫఓ రేవంత్ చంద్ర వెల్లడించారు. ఈ అభయారణ్యంలో 18 ఆడ, 14 మగ, 2 ఉప వయోజన పులులతో పాటు 8 పులి పిల్లలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. ఈ సర్వేను 2025, నవంబరు నుంచి 2026, జూన్ వరకు 8 నెలల పాటు 2,611 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్వహించారు. 2024 సర్వే ప్రకారం అమ్రాబాద్ అభయారణ్యంలో 34 పెద్దపులులుండగా ప్రస్తుతం వాటి సంఖ్య 42కు పెరగడంతో నల్లమలలో అటవీ అధికారులు చేపడుతున్న పులులు, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు సత్ఫలితాలనిస్తున్నట్లు తెలుస్తోంది.