10 జన్‌పథ్‌కు ఏటీఎంలా తెలంగాణ
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:58 AM
సీఎం రేవంత్ తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని ఢిల్లీలోని ఒక రాజ కుటుంబానికి సేవలు చేసేందుకు ఏటీఎంలా వాడుకుంటున్నారని బీజేపీ ఐటీ సెల్ ఇన్‌చార్జి అమిత్ మాలవీయ ఆరోపించారు..
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై అమిత్ మాలవీయ విమర్శలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని ఢిల్లీలోని ఒక రాజ కుటుంబానికి సేవలు చేసేందుకు ఏటీఎంలా వాడుకుంటున్నారని బీజేపీ ఐటీ సెల్ ఇన్‌చార్జి అమిత్ మాలవీయ ఆరోపించారు. తెలంగాణ యువత డీఎస్సీ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, రైతులు రైతుభరోసా కోసం అల్లాడుతున్న సమయంలో రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాహుల్‌గాంధీ కుటుంబానికి ఆర్థిక అవసరాలు ఉంటే తెలంగాణ నుంచి రూ.1000 కోట్లు పోగు చేసి ఇవ్వగల శక్తి కాంగ్రెస్ కార్యకర్తలకు ఉందంటూ’ రేవంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు.