సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్
ABN , Publish Date - Apr 14 , 2026 | 10:59 PM
సమానత్వ సమాజం కోసం కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బీఆర్ అంబేద్కర్ 175వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
-జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి) : సమానత్వ సమాజం కోసం కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బీఆర్ అంబేద్కర్ 175వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమీకృత కలెక్టరేట్ భవనంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్ అని ఆయన దేశానికి అం దించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆనాటి సమాజంలోని అసమాన తలను ఎదుర్కొని ఉన్నత విద్యను అభ్యసించి సమాన అవకాశాల కోసం రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. అనంతంర తెలంగాణ సంస్కృతి సా రధి కళాకారులు అంబేద్కర్‌పై మామిళ్ల లచ్చన్న ఆలపించిన గీతాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకు న్నాయి. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్‌లు చంద్రయ్య, శ్రీనివాసరావు, అధికారులు దుర్గా ప్రసాద్, కిషన్, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.