Share News

కందికొండలో అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:55 AM

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం కందికొండలో గుర్తుతెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు..

కందికొండలో అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం

  • మరో విగ్రహం ఏర్పాటు, ఆవిష్కరణ

కురవి(మహబూబాబాద్‌ జిల్లా), ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం కందికొండలో గుర్తుతెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంబేడ్కర్‌ జయంతి రోజున మంగళవారం ప్రభుత్వ విప్‌ రాంచందర్‌నాయక్‌ చేతుల మీదుగా ఈవిగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. అయితే గ్రామంలోని రెండు దళిత వర్గాల మధ్య విభేదాలతో ఒక వర్గం నాయకులు అంబేడ్కర్‌ విగ్రహం ముఖ భాగాన్ని ధ్వంసం చేశారు. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు అప్పటికప్పుడు ఖమ్మం నుంచి మరో విగ్రహాన్ని కొనుగోలు చేసి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. అనంతరం ఎమ్మెల్యే రాంచందర్‌నాయక్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని దుండగులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ పవన్‌కుమార్‌ వెల్లడించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ పేర్కొన్నారు.

Updated Date - Apr 15 , 2026 | 04:55 AM