Share News

kumaram bheem asifabad- అమాత్యా..ఆలకించరా..

ABN , Publish Date - Jan 21 , 2026 | 10:21 PM

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృధ్ది పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపద్యంలో జిల్లాలో నెలకొన్న సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఎన్నికల ముందు 2023లో సీఎల్ప్‌ నేతగా ఉన్న భట్టి విక్రమార్క జిల్లాలో పాదయాత్ర నిర్యహించి ఈ ప్రాంత సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు గడిచిన ఇక్కడి సమస్యలు పరిష్కారానికి నోచుకొలేదు.

kumaram bheem asifabad- అమాత్యా..ఆలకించరా..
అసంపూర్తిగా ఉన్న గుండి వంతెన

- ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా అమలుపై పట్టింపు కరువు

- నేడు జిల్లాలో పర్యటించనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఆసిఫాబాద్‌/జైనూర్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృధ్ది పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపద్యంలో జిల్లాలో నెలకొన్న సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఎన్నికల ముందు 2023లో సీఎల్ప్‌ నేతగా ఉన్న భట్టి విక్రమార్క జిల్లాలో పాదయాత్ర నిర్యహించి ఈ ప్రాంత సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు గడిచిన ఇక్కడి సమస్యలు పరిష్కారానికి నోచుకొలేదు.

- పెండిగ్‌లోనే సాగు నీటి ప్రాజెక్టులు:

జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులు పెండింగ్‌లోనే ఉన్నాయి. దశాబ్దాలుగా జిల్లా రైతాంగానికి వర్షాధారమే సాగ దిక్కవుతుంది. ఏళ్లుగా ప్రధాన ప్రాజెక్టులు అన్ని పెండింగ్‌లో ఉండడంతో సాగులో పెద్దగా మార్పు జరగడం లేదు. కుమరం భీం ప్రాజెక్టు, జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో కాలేదు. అదే విధంగా వట్టివాగు, చెలిమెల వాగు ప్రాజెక్టు కాలువలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. సాగునీటి ప్రాజెకులకు నిధులు మంజూరు చేయకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు.

- వంతెనలు, రహదారులు లేక అవస్థలు:

జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాలలో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు దశాబ్దలుగా కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసిఫాబాద్‌ మండలంలోని పెద్దవాగుపై గుండి వంతెన నిర్మాణ పనులు దశాబ్దన్నర కాలం అయినా పూర్తికాలేదు. కెరమెరి మండలంలోని అనార్‌పల్లి-కరంజివాడ, లక్మాపూర్‌ వంతెనల నిర్మాణ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. కాగజ్‌నగర్‌- వాంకిడి మండలాల మధ్య కనర్‌గాం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు 15 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి అసంపూర్త్తిగానే ఉంది. తిర్యాణి మండలంలోని నాయకపుగూడ గ్రామం నుంచి దుగ్గపూర్‌ గ్రామానికి మద్యలో వాగు పై నిర్మిస్తున్న వంతెన నేటికి పూర్తి కాలేదు, జిల్లాలో నేటికీ 449 గిరిజన గ్రామాలు రోడ్డు సౌకర్యానికి నోచుకోకపోవడంతో ఆయా గ్రామాలకు వెళ్లాలంటే నిత్యం నరకయాతన పడుతున్నారు. ప్రస్తుతం ఉట్నూర్‌ ఎక్స్‌ రోడ్డు నుంచి జైనూరు వరకు, జైనూరు నుంచి కెరమెరి, ఆసిఫాబాద్‌ వరకు రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు నిత్యం రాకపోకలకు అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. దాదాపు జిల్లాలోని 15 మండలాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దులోని చంద్రపూర్‌, నాగ్‌పూర్‌, గడ్చిరోలి తదితర జిల్లాలతో పాటు ఆసిఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌ నగర్‌ డివిజన్‌ పరిధిలోని అన్ని మండలాల ప్రయాణికులు నిత్యం ఇదే రహదారి గుండా రాక పోకలు సాగిస్తుంటారు. ఈ రోడ్డు మార్గాన ప్రయాణించే మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు, పాలకులు చోద్యం చూస్తున్నారే తప్ప నిధుల మంజురుకు కృషి చేయడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సెషన్‌లో ఈ రోడ్డు పరిస్థితిపై ఎమ్మెల్యే ప్రభుత్వానికి నివేదించారు.. అయినప్పటికీ నిధుల జాడ మాత్రం కన్పించడం లేదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అంతర్రాష్ట్ర రహదారికి నిర్లక్ష్యం చూపుతోందని ఎమ్యెల్యే మండి పడ్డారు. ప్రభుత్వం నిధులు కేటాయించాలని ప్రస్తావించారు.జిల్లాలోని గురుకులాలు, వసతి గృహలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి వసతి గృహలు. గురుకులాలకు సరిపడ భవనాలు నిర్మించకపోవడంతో నేటికి కొన్ని గురుకులాలు అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య నెట్టుకు రావాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఉన్న సొంత భవనాల్లో కూడా సమస్యలు పేరుకుపోయాయి. భవనాలు శిధిలావస్థకు చేరుకోవడం, గదులు సరిపొక పోవడంతో విద్యార్థుల అవస్థలు పడుతున్నారు. మెడికల్‌ కళాశాలలో వైద్యవిద్యను బోధించే ప్రొఫెసర్‌, అసోసియోటెడ్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉండడంతో వైద్య విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి 300 పడకలకు స్థాయికి పెంచి మెడికల్‌ కళాశాల అనుసంధానంగా మార్చినా స్పెషలిస్టు డాక్టర్‌లు లేక సరైన వైద్యం అందడంలేదు.

Updated Date - Jan 21 , 2026 | 10:21 PM