Share News

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

ABN , Publish Date - Jul 30 , 2026 | 11:06 PM

జిల్లాలో నెలకొంటున్న ప్రస్తుత వర్షాభావ పరిస్థి తులను దృష్టిలో ఉంచుకుని రైతులు అధిక నీటి అవసరమున్న వరి తదితర పంటలను సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లా లని కలెక్టర్‌ హేమంత కేశవ్‌పాటిల్‌ సూచించా రు.

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
నాగర్‌కర్నూల్‌ మండల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

నాగర్‌కర్నూల్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నెలకొంటున్న ప్రస్తుత వర్షాభావ పరిస్థి తులను దృష్టిలో ఉంచుకుని రైతులు అధిక నీటి అవసరమున్న వరి తదితర పంటలను సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లా లని కలెక్టర్‌ హేమంత కేశవ్‌పాటిల్‌ సూచించా రు. గురువారం నాగర్‌కర్నూల్‌ మండల సర్వస భ్య సమావేశానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజ రై మాట్లాడారు. వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హె చ్చరించినందున రైతులు తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని సూచించారు. వ్యవ సాయ, ఉద్యానవన శాఖ అధికారులు గ్రామాల లో రైతులతో సమావేశాలు నిర్వహించి పంటల ఎంపికపై అవగాహన కల్పించాలన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టే చెక్‌డ్యామ్‌లు, ఇంకుడు గుంత లు, రీచార్జ్‌ నిర్మాణాలు, ఇతర నీటి సంరక్షణ ప నులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. గ్రామ సమస్యలకు తాత్కాలికంగా పరిష్కారాలు కాకుండా శా శ్వత పరిష్కారాలు చూపే దిశగా చర్యలు తీసుకోవాలని గ్రామాల్లో ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి అంశాలపై స ర్పంచ్‌లు మొదటి ప్రాధాన్య తనివ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అ ర్చన, ఎంపీడీవో చెన్నమ్మ, ఎం ఈవో కుర్మయ్య, వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీరాజ్‌ శాఖల అఽధికారు లు, గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శు లు, ప్రజా ప్రతినిధు లు పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌ డిజిటలైజేషన్‌ పరిశీలన

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ను గురువారం నాగర్‌క ర్నూల్‌ పట్టణంలోని 116వ పోలింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ హేమంత కేశవ్‌పాటిల్‌ పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రంలో జరుగుతున్న పనుల పురోగ తిని తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు. 116వ పోలింగ్‌ కేంద్రంలో 1276 మంది ఓటర్లు ఉండగా 99.25శాతం మంది వివరాలను ఇప్పటికే డిజిటలైజేషన్‌ చేసినట్లు బీఎల్‌వో తెలి పారు. అనంతరం నాగర్‌కర్నూల్‌ నియోజక వర్గం మొత్తం డిజిటలైజేషన్‌ పురోగతిపై ఆర్డీవో అర్చనతో కలెక్టర్‌ ఆరా తీశారు. కలెక్టర్‌ వెంట మునిసిపల్‌ చైర్మన్‌ తీగల సునేంద్ర, ఆర్డీవో అర్చన, మునిసిపల్‌ కమిషనర్‌ నాగిరెడ్డి, తహసీ ల్దార్‌ తబితారాణి, డీటీ కిరణ్‌కుమార్‌, బీఎల్‌వో లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 11:06 PM