Share News

ప్రత్యామ్నాయ పంటలు మేలు

ABN , Publish Date - Aug 19 , 2026 | 11:23 PM

వరికి ప్రత్యామ్నాయ పం టల సాగుతో రైతులకు లాభదాయకంగా ఉం టుందని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్ర టరీ సురేంద్ర మోహన్‌, కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌లు సూచించారు.

ప్రత్యామ్నాయ పంటలు మేలు
బిజినేపల్లి : కొట్టాల్‌గడ్డలో రైతు మాధవరెడ్డి సాగు చేసిన కూరగాయల పంటను పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేంద్ర మోహన్‌, కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

- వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేంద్ర మోహన్‌

నాగర్‌కర్నూల్‌/ బిజినేపల్లి/ తాడూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : వరికి ప్రత్యామ్నాయ పం టల సాగుతో రైతులకు లాభదాయకంగా ఉం టుందని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్ర టరీ సురేంద్ర మోహన్‌, కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌లు సూచించారు. బిజినేపల్లి, తాడూరు మండలాల్లోని మహదేవునిపేట, కొట్టాల్‌గడ్డ, తా డూరు మండలంలోని చెర్ల ఇటిక్యాల గ్రామా ల్లోని రైతులు తక్కువ నీటి వినియోగం, సాంకే తిక పరిజ్ఞానంతో పంటలను సాగు చేయడాన్ని అభినందించారు. వారు మాట్లాడుతూ రైతులు కూరగాయల మొక్కలకు అవసరమైన ఆధారా న్ని కల్పించేందుకు స్టేకింగ్‌, టైలీసింగ్‌ పద్ధతు లను పాటిస్తూ వాటి పెరుగుదలను క్రమబద్ధీ కరించడం, కాయలను నేలకు తాకకుండా చూడడం ద్వారా అధిక ప్ర యోజనాలు పొందుతున్నా రని కొనియాడారు. కొట్టాల్‌ గడ్డలో రైతు మాధవరెడ్డి ఆ ధునిక వ్యవసాయ పద్ధతు లు పాటిస్తూ సాగు చేసిన పంటలను పరిశీలించి వివిధ విషయాలను అడిగి తెలుసు కొని అభినందించారు. తాడూ రు మండలం చెర్లఇటిక్యాల గ్రామంలో రైతు రా జేందర్‌రెడ్డి 3.5 ఎకరాల్లో సాగు చేసిన ఆయి ల్‌పామ్‌ తోటను పరిశీలించారు. బిందు సేద్యం తో తక్కువ నీటి వినియోగంతో సేంద్రియ ఎరు వులు వినియోగించి తక్కువ పెట్టుబడితో సరైన పోషకాలను మొక్కలకు అందిస్తూ అధిక దిగుబ డిని రాబడుతున్నట్లు కొనియాడారు. సురేంద్ర మోహన్‌, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వర్‌ రావుకు వీడియో కాల్‌ చేసి రైతులతో ముఖాముఖి మాట్లాడించారు. వినూ త్నంగా వ్యవసాయ పద్ధతులు చేపట్టి తోటి రైతు లకు ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందిం చారు. వారి వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధి కారి చంద్రశేఖర్‌, జిల్లా ఉద్యానవన శాఖ అధి కారి వెంకటేశం, ఏడీఏ పూర్ణచంద్రారెడ్డి, డివిజ న్‌ హార్టికల్చర్‌ అధికారి జగన్‌, మండల వ్యవ సాయ శాఖ అధికారి కమల్‌ కుమార్‌, ఏఈవో లు తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 19 , 2026 | 11:23 PM