ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Aug 30 , 2026 | 11:54 PM
పట్ట ణంలోని నేషనల్ హైవే-167కు ఇరుపక్కల ఏ ర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలను తొలగించి నందున, ఆ చిరువ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయ ణరెడ్డి, అధికారులను ఆదేశించారు.
- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
- కల్వకుర్తిలో ఇటీవల తొలగించిన చిరు వ్యాపారుల ఆక్రమణల పరిశీలన
కల్వకుర్తి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి) : పట్ట ణంలోని నేషనల్ హైవే-167కు ఇరుపక్కల ఏ ర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలను తొలగించి నందున, ఆ చిరువ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయ ణరెడ్డి, అధికారులను ఆదేశించారు. పట్టణంలో ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలని ఎమ్మెల్యే కోరారు. ఆదివారం ఆయన మునిసిపాలిటీ పరి ధిలోని ఎన్‌హెచ్-167ను క్షేత్రస్థాయి లో పరిశీలించారు. హైవేపై ఆక్రమ ణల కారణంగా పాదచారులు, వాహ నదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందు లను ఎమ్మెల్యే పరిశీలించారు. జాతీ య రహదారి కావడంతో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగ కుండా పాదచారులు సురక్షితంగా రాకపోకలు సాగించేలా ఫుట్‌పాత్‌లను అందుబాటులోకి తీ సుకురావాలని సూచించారు. ఫుట్ పాత్‌లపై చి న్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచిం చారు. హైవే అభివృద్ధి, ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులు, ప్రజాప్రతి నిధులు స మన్వయంతో పని చేయాలని సూచించారు. కా ర్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ బృంగి రత్న మాల, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కు మార్, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మనిసి పల్ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.