ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Apr 22 , 2026 | 11:17 PM
ప్రయాణికులకు ఇబ్బందులు లేకుం డా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని క లెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యో తి) : ప్రయాణికులకు ఇబ్బందులు లేకుం డా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని క లెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవా రం నాగర్‌కర్నూల్ డిపోకు వెళ్లి కలెక్టర్ అ క్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలిం చారు. సమ్మె ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల ని, సుదూర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డిపోలో అందుబాటులో ఉన్న బస్సుల సంఖ్య, నడుస్తున్న రూట్లు, ప్రయాణికుల రద్దీ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నా రు. జిల్లా ప్రజల రవాణా అవసరాలను తీర్చేం దుకు ఆర్టీసీ సేవలను మరింత సమర్థవంతం గా నిర్వహించాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ సంగ్రా మ్‌సింగ్‌జీ పాటిల్ కలిసి ఆర్టీసీ అధికారులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం గూగుల్ మీట్ ద్వారా ఆర్డీవోలు, డీఎస్పీలు, ఆర్టీసీ డిపో మేనే జర్లు తదితర అధికారులతో జరిగింది. ఈ స మావేశంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు. డ్రైవర్ నియామక ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు లేని పూర్తి ఆరోగ్యవంతులైన డ్రైవర్లను మాత్రమే తాత్కాలిక పద్దతిలో నియమించాలని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్ మాట్లాడు తూ తాత్కాలికంగా నియమితులయ్యే డ్రైవర్లు, కండక్టర్లు జిల్లా పోలీస్ శాఖ సహకరిస్తుందని అదే సమయంలో తాత్కాలిక సిబ్బంది ఎవరైనా దుర్వ్యవహారం చేస్తే కఠిన చర్యలు తీసుకుం టామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజా రవాణా సేవలు సజావుగా సాగేందుకు శాంతి భద్ర తలను కట్టుదిట్టం చేస్తామని ఆయన పేర్కొన్నారు.