Share News

kumaram bheem asifabad- అధికారులతో పోడు రైతుల వాగ్వాదం

ABN , Publish Date - Jul 08 , 2026 | 11:06 PM

వాంకిడి మండలం చిచ్చుపల్లి పంచాయతీ పరిధిలోని డోంగర్‌గాం శివారులోని పోడు భూముల విషయంలో ఆటవీశాఖ అధికారులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ పోడుభూముల్లో ఐదుగురు రైతులు దాదాపు 20 ఎకరాల భూమిలో పత్తి పంట సాగు చేస్తున్నారు. ఈ భూముల్లో ఆటవీశాఖ అధికారులు ప్లాంటేషన్‌కోసం బుధవారం ట్రాక్టర్‌ తో చదును చేస్తుండగా విషయం తెలుసుకున్న రైతులు అడ్డుకున్నారు. దీంతో కొంత సేపు రైతులకు ఆటవిశాఖ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాము కొన్ని సంవత్సరాల నుంచి ఈ భూములను సాగు చేసుకుంటు జీవనం గడుపుతున్నామని చెప్పారు

kumaram bheem asifabad- అధికారులతో పోడు రైతుల వాగ్వాదం
రైతులతో మాట్లాడుతున్న ఎస్సై మహేందర్‌

వాంకిడి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): వాంకిడి మండలం చిచ్చుపల్లి పంచాయతీ పరిధిలోని డోంగర్‌గాం శివారులోని పోడు భూముల విషయంలో ఆటవీశాఖ అధికారులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ పోడుభూముల్లో ఐదుగురు రైతులు దాదాపు 20 ఎకరాల భూమిలో పత్తి పంట సాగు చేస్తున్నారు. ఈ భూముల్లో ఆటవీశాఖ అధికారులు ప్లాంటేషన్‌కోసం బుధవారం ట్రాక్టర్‌ తో చదును చేస్తుండగా విషయం తెలుసుకున్న రైతులు అడ్డుకున్నారు. దీంతో కొంత సేపు రైతులకు ఆటవిశాఖ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాము కొన్ని సంవత్సరాల నుంచి ఈ భూములను సాగు చేసుకుంటు జీవనం గడుపుతున్నామని చెప్పారు. పంట మొలకలు వ చ్చిన తరువాత చదును చేయడం సరికాదని ఆవేదన చెందారు. ముందుగా సమాచారం ఇస్తే విత్తనాలు వేసేవాళ్లం కాదని రైతులు వాపోయారు. 40 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములను ఇప్పడు లాక్కుంటే ఎలా బతకాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పత్తి పంట మొలకలు వచ్చాయని ఈఏడాది పంట కాలం అయ్యే వరకు అవకాశాం ఇవ్వాలని లేని పక్షంలో తమకు పంట నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేశారు. సమాచారం మేరకు ఎస్సై మహేందర్‌, ఎఫ్‌ఆర్వో గోవింద్‌చంద్‌ సర్డార్‌ సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో చర్చలు జరిపారు. ఈ విషయాన్ని జిల్లా ఆటవీశాఖ అధికారికి విన్నవించాలని రైతులను అక్కడికి పంపించారు.

Updated Date - Jul 08 , 2026 | 11:06 PM