Share News

అల్ఫోర్స్‌ విద్యార్థులకు అత్యున్నత ర్యాంకులు

ABN , Publish Date - May 18 , 2026 | 03:22 AM

ఎప్‌సెట్‌-2026 ఫలితాల్లో అల్ఫోర్స్‌ విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు సాధించి రాష్ట్రస్థాయిలో విజయకేతనం ఎగురవేశారు...

అల్ఫోర్స్‌ విద్యార్థులకు అత్యున్నత ర్యాంకులు

కరీంనగర్‌ టౌన్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ఎప్‌సెట్‌-2026 ఫలితాల్లో అల్ఫోర్స్‌ విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు సాధించి రాష్ట్రస్థాయిలో విజయకేతనం ఎగురవేశారు. కరీంనగర్‌లోని అల్ఫోర్స్‌ కళాశాల ఆవరణలో రాష్ట్రస్థాయి ర్యాంకులను సాధించిన విద్యార్థులను విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ వి నరేందర్‌రెడ్డి ఆదివారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్ఫోర్స్‌ విద్యార్థి డి. రిత్విక్‌ అగ్రికల్చర్‌ ఫార్మసీ విభాగంలో 11వ ర్యాంకుతో అత్యుత్తమ స్థానంలో నిలవగా, పి. చరణ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో 22వ ర్యాంకుతో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. అల్ఫోర్స్‌ విద్యార్థులు సీహెచ్‌. లక్ష్మిహాసిని (ఇంజనీరింగ్‌ విభాగంలో) 74వ ర్యాంకు, నిదా 157వ ర్యాంకు, పి. అక్షయ 251, ఎల్‌. ఆర్యన్‌రావు 252, మహ్మద్‌ హుస్సేన్‌ 272, వి. రుచిత 293, ఎ. నాగసింధు 330, బి. అభిజ్ఞ 430, వి. సుహాని 439, విశ్రేయ్‌సరెడ్డి 487 ర్యాంకులతో అఖండ విజయం సాధించారని తెలిపారు. 169 మంది విద్యార్థులు ఐదు వేలలోపు ర్యాంకులు సాధించి అల్ఫోర్స్‌ కీర్తి ప్రతిష్టలను చాటారని నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - May 18 , 2026 | 03:22 AM