Share News

ఆల్మట్టికి స్వల్పంగా వరద

ABN , Publish Date - Jul 21 , 2026 | 05:05 AM

కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. సోమవారం ఆల్మట్టి ప్రాజెక్టుకు 40,173 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, ఔట్‌ఫ్లో 16458 క్యూసెక్కులుగా ఉంది.

ఆల్మట్టికి స్వల్పంగా వరద

  • 40,173 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో... ఔట్‌ఫ్లో 16 వేల క్యూసెక్కులు

హైదరాబాద్‌, జూలై 20(ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. సోమవారం ఆల్మట్టి ప్రాజెక్టుకు 40,173 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, ఔట్‌ఫ్లో 16458 క్యూసెక్కులుగా ఉంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 98.36 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 15688 క్యూసెక్కులుగా ఇన్‌ఫ్లో ఉంది. 7271 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 2083 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. కడెంకు 392 క్యూసెక్కుల వరద వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిళ్ల బ్యారేజీకి 210 క్యూసెక్కులు, అన్నారంకు 247 క్యూసెక్కులు, మేడిగడ్డకు 16620 క్యూసెక్కులు, సమ్మక్కసాగర్‌(తుపాకులగూడెం)కు 22100 క్యూసెక్కులు, దుమ్ముగూడెం(సీతమ్మసాగర్‌)కు 26128 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా... వచ్చింది వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు 900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రికార్డయింది.

Updated Date - Jul 21 , 2026 | 05:06 AM