అల్లు అర్జున్..22వ తేదీన కోర్టుకు రండి
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:42 AM
పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌కు...
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీ, సోమవారం న్యాయస్థానంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ముంబైలో సినిమా షూటింగ్‌లో ఉన్నందున వ్యక్తిగతంగా కాకుండా వర్చువల్‌గా విచారణకు హాజరవుతానని అల్లు అర్జున్ దాఖలు చేసి న పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. న్యాయస్థానం ముందు కచ్చితంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. అల్లు అర్జున్ హైదరాబాద్‌లో అందుబాటులో లేకపోవడంతో ఆయన తండ్రి అల్లు అరవింద్‌కు సమన్లు అందించారు. కాగా, ఈ కేసులో అల్లు అర్జున్ ఏ11 నిందితుడిగా ఉన్నారు. నిందితుల వ్యక్తిగత హాజరు పూర్తయిన తర్వాత ట్రయల్ ప్రారంభమవనుంది. ఇక, 2024నాటి ఈ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.