ఆందోళన చెందవద్దు.. మేం అండగా ఉంటాం
ABN , Publish Date - May 07 , 2026 | 05:48 AM
పుష్ప సినిమా రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కుటుంబానికి తాము అండగా ఉంటామని, ఆందోళన చెందవద్దని సినీ నటుడు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి...
శ్రీతేజ్ కుటుంబసభ్యులకు అల్లు అరవింద్, స్నేహారెడ్డి భరోసా
సికింద్రాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): పుష్ప సినిమా రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కుటుంబానికి తాము అండగా ఉంటామని, ఆందోళన చెందవద్దని సినీ నటుడు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, ఆయన తండ్రి అల్లు అరవింద్ భరోసా ఇచ్చారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృత్యువాత పడగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి విదితమే. శ్రీతేజ్ కుటుంబానికి ఇప్పటికే అండగా నిలిచిన అల్లు అర్జున్ ఫ్యామిలీ తాజాగా వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్, బాబాయి మల్లికార్జున్‌లతో అల్లు అరవింద్, స్నేహారెడ్డి చాలా సేపు మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. అతడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, మున్ముందు మరింత మెరుగైన వైద్య చికిత్స అందించడం తదితర వివరాలు తెలుసుకునేందుకు శ్రీతేజ్ చికిత్స పొందుతున్న రిహాబిలిటేషన్ కో-ఆర్డినేటర్‌తో అల్లు అరవింద్, స్నేహారెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. శ్రీతేజ్‌కు ఎక్కడ మెరుగైన వైద్య చికిత్స అందించాల్సి ఉన్నా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.