Share News

kumaram bheem asifabad- కేటాయింపులు నామమాత్రమే

ABN , Publish Date - Mar 20 , 2026 | 11:08 PM

తెలంగాణ బడ్జెట్‌లో జిల్లాకే కేటాయింపులు నామామత్రంగానే దక్కాయి. బడ్జెడ్‌పై బోలెడు ఆశలు పెంచుకున్న జిల్లా ప్రజలకు నిరాశ కలిగింది. తెలంగాణ శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశా ఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.3,24,234 కోట్లు ప్రకటించారు

kumaram bheem asifabad-  కేటాయింపులు నామమాత్రమే
లోగో

- జిల్లాలో రోడ్లు, వంతెనల నిర్మాణంపై స్పష్టత కరువు

- ప్రాజెక్టుల పూర్తిపై అనుమానాలు

- కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా

- విద్యారంగానికి ఊరట

- బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు

ఆసిఫాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బడ్జెట్‌లో జిల్లాకే కేటాయింపులు నామామత్రంగానే దక్కాయి. బడ్జెడ్‌పై బోలెడు ఆశలు పెంచుకున్న జిల్లా ప్రజలకు నిరాశ కలిగింది. తెలంగాణ శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశా ఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.3,24,234 కోట్లు ప్రకటించారు. ఇందులో వ్యవసాయశాఖకు రూ. 23,179 కోట్లు, విద్యుత్‌ శాఖకు రూ. 21,285 కోట్లు, పౌరసరఫరాలశాఖకు రూ. 7,366 కోట్లు, పశుసంవర్థకశాఖకు రూ. 1529 కోట్లు, విద్యాశాఖ కు రూ. 26,674 కోట్లు, వైద్యశాఖకు రూ. 13,679 కోట్లు, కార్మికశాఖకు రూ. 998 కోట్లు, మహిళ శిశు సంక్షేమాశా ఖకు రూ.3143 కోట్లు, పర్యటక రంగానికి రూ. 1224 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.7934 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ 12, 511 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ. 3769 కోట్లు, ఆరోగ్య శ్రీకి రూ. 1143 కోట్లు, ఉపకార వేతనాలకు రూ. 4343 కోట్లు, కల్యాణలక్ష్మి పథకానికి రూ.3683 కోట్లు, గృహజ్యోతి పథకానికి రూ. 2080 కోట్లు, మహలక్ష్మి పథకానికి రూ. 4305 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు రూ. 5500 కోట్లు, చేయూత పథకానికి రూ. 14,861 కోట్లు, రైతుభరోసాకు రూ. 18వేల కోట్లు, అరు గ్యారంటీల అమలుకు రూ. 50,713 కోట్లు, యంగ్‌ ఇండియా స్కూళ్లకు రూ. ఐదు వేల కోట్లు కేటాయించారు.

పేద, ధనిక తేడా లేకుండా..

బడ్జెట్‌లో పేద, ధనిక, మధ్యతరగతి అని తేడా లేకుండా రాష్ట్రంలోని 1.5 కోట్ల కుటుం బాలకు ఇంది రమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా ఒక్కొ కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున బీమా వర్తించనుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2 నుంచి దీనిని అమలు చేయనున్నట్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. ఈ పథకం అమల యితే జిల్లాలోని 1.20 లక్షల కుటుంబాలకు జీవిత బీమా వర్తించనుంది. రాష్ట్రంలోని ప్రీ పైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అందరికి బ్రేక్‌ఫాస్టు పథకాన్ని అందిస్తామని బడ్జెట్‌లో వెల్లడించారు. దీంతో పాటు ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిం చారు. ఈ పథకాలను 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు వివరించారు.

- 16వేల మంది విద్యార్థులకు..

జిల్లాలో అల్పాహారం పథకం అమలయితే 16వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. అలాగే ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న బోజన పథకాన్ని అమలు చేస్తే ఐదు వేల మంది విద్యార్థులకు లబ్ది చేకూర నుంది. ఈ పథకాల అమలయితే జిల్లాలో విద్యాభివృద్ధికి బాటలు పడనున్నాయి. రాష్ట్రంలో ప్రజారోగ్యం వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్సనర్లకు నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రారంబించనున్నట్లు ప్రకటించారు. రాజీవ్‌ ఆరోగ్య ట్రస్టు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు యం ప్యానేల్‌ ప్రైవేటు ఆసుపత్రులలో 1998 వ్యాధులకు చికిత్స పొందవచ్చని చెప్పారు. ఈ మేరకు ప్రతీ ఉద్యోగికి డిజిటల్‌ హెల్త్‌ కార్డులు అందిస్తామన్నారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్సనర్లకు ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులకు నిధులు కేటాయించామని ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రకటించారు. జిల్లాలోని కుమరంభీం ప్రాజెక్టు, ప్రాణ హిత చేవేళ్ల ప్రాజెక్టుల పనులను పూర్తి చేసి సాగునీరందిస్తామమని చెప్పారు. చెరువుల్లో పూడికతీత పనులను చేపడతామన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌పై భిన్నాబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అంకెల గారడిగా బడ్జెట్‌..

- కోవ లక్ష్మి, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంకెల గారడిగా ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి నిధులు కేటాయించ లేదు. నియోజకవర్గాల అభివృద్ధికి బడ్జెట్‌లో సీడీపీ నిధులకు కేటాయింపులు లేవు.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల ఊసేలేదు. ఆరుగ్యారంటీలకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. చేయూత పెన్షన్ల పెంపు ఊసెత్తలేదు. ప్రాజెక్టులకు సరిపడా నిధులు కేటాయించ లేదు. నియోజకవర్గాల్లో కొత్త రోడ్ల నిర్మాణా నికి నిధుల కేటాయింపు జరుగలేదు. ఆటో కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారు.

ప్రజా సంక్షేమానికి పెద్దపీట..

- అత్రం సుగుణక్క, డీసీసీ అధ్యక్షురాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌ రాష్ట్ర ప్రజల ఆశలు, అకాంక్షలను అద్దం పట్టేలా ఉంది. బడ్జెట్‌లో ప్రజా సంక్షేమానికి పెద్కపీట వేశారు. బడ్జెట్‌ ద్వారా ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమానికి సమతు ల్యంగా నిధులు కేటాయించడం అభినందనీ యం. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ బడ్జెట్‌ ద్వారా స్పష్టం చేసింది.

కార్మిక రంగంపై చిన్నచూపు..

-బోగే ఉపేందర్‌, సీపీఐ జిల్లా నాయకులు

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో కార్మిక రంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూసింది. కార్మిక రంగానికి తక్కువ నిధులు కేటాయించారు. ఆర్టీసీకి నిధులు కేటాయించలేదు. అరు గ్యారంటీలపై స్పష్టమైన హమీ ఇవ్వలేదు. సింగరేణికి రావాల్సిన బకాయిలు రూ 50వేల కోట్లపై బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తవన తీసుకుర ాలేదు. రాష్ట్ర బడ్జెట్‌పై కార్మిక, కర్షక వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి.

హామీని నిలబెట్టని బడ్జెట్‌..

-కాంపల్లి ఊశన్న, టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా నాయకుడు

ప్రభుత్వం విద్యా రంగానికి 15 శాతం నిఽ దులు కేటాయిస్తామని మేనిఫెస్టోలో పెర్కొన్న హామీ వరుసగా మూడవ బడ్జెట్‌లో కూడా నేరవేరలేదు. గత సంవత్సరం విద్యా రంగా నికి 7.58 శాతం కేటాయించగా ఈ సంవత్స రం 8.22 శాతం నిధులు మాత్రమే కేటాయి ంచారు. బడ్జెట్‌ను సమీక్షించి కనీసం 15 శాతం నిధులు కేటాయించాలి. డీఏ ఏరి యర్స్‌, పెండింగ్‌ బిల్లులు, పీఆర్సీ ప్రస్తావన బడ్జెట్‌లో లేకపోవడం విచారకరం.

Updated Date - Mar 20 , 2026 | 11:08 PM