అర్హులకే ఇళ్ల కేటాయింపు
ABN , Publish Date - Aug 25 , 2026 | 10:46 PM
అర్హులైన వారికి లక్కీడ్రా పద్ధతిలో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయిం చామని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం సండ్రోన్‌పల్లి గ్రామంలోని కేఆర్ గార్డెన్స్‌లో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లకు లక్కీడ్రా తీశారు. 296 ఇళ్లను రిజర్వేషన్‌ల ప్రకారం లక్కీడ్రా పద్ధతిన ఎంపిక చేశారు.
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
-కలెక్టర్ కుమార్ దీపక్
మందమర్రిరూరల్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : అర్హులైన వారికి లక్కీడ్రా పద్ధతిలో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయిం చామని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం సండ్రోన్‌పల్లి గ్రామంలోని కేఆర్ గార్డెన్స్‌లో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లకు లక్కీడ్రా తీశారు. 296 ఇళ్లను రిజర్వేషన్‌ల ప్రకారం లక్కీడ్రా పద్ధతిన ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదలైన ఇళ్లు లేని వారికి డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించామని, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చేపట్టా మన్నారు. లబ్దిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిగిందన్నారు. లబ్దిదారుల ముందే లక్కీడ్రా తీసి ఇళ్లను అందించా మ న్నారు. లబ్దిదారులు వారికి కేటాయించిన ఇళ్లలోనే నివాసం ఉండాలని సూచించారు. నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉండేందుకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, తహసీల్దార్ సతీష్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, ఇందిరమ్మ ఇళ్ల పీడీ బన్సీలాల్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, మందమర్రి సీఐ రమేష్, ఎస్‌ఐ నరేష్, పోలీసులు, లబ్దిదారులు, అధికారులు పాల్గొన్నారు.